AP Police: ఆన్లైన్లో వేధింపులకు పాల్పడితే ఈ వాట్సప్ నంబర్ కు ఫిర్యాదు చేయండి: ఎస్పీ సోషల్ మీడియాలో వివాదాస్పద పోస్టులు పెడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు ఏలూరు జిల్లా ఎస్పీ మేరీ ప్రశాంతి. విద్వేషాలు పెంచేలా పోస్టులు పెడితే 90300 04969 వాట్సప్ నంబర్ కు ఫిర్యాదు చేయవచ్చన్నారు. 5 సంవత్సరాల జైలుతో పాటు జరిమానా ఉంటుందని తెలిపారు. By Jyoshna Sappogula 24 Mar 2024 in ఆంధ్రప్రదేశ్ క్రైం New Update షేర్ చేయండి Online Harassment: రానున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో సోషల్ మీడియాపై ప్రత్యేక నిఘా ఉంటుందని తెలిపారు ఏలూరు జిల్లా ఎస్పీ మేరీ ప్రశాంతి. వివాదాస్పద పోస్టులు పెడితే బాధ్యులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎన్నికల సందర్భంగా సామాజిక మాధ్యమాల్లో పాటించాల్సిన నిబంధనలపై వాటి నిర్వాహకులు, అడ్మిన్లకు సూచనలు, సలహాలు ఇచ్చేందుకు పోలీసు కార్యాలయ సమావేశ మందిరంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. Also Read: వివేకాను హత్య చేసి తప్పు చేశా.. ప్రాణాల మీద ఆశ వదిలేసుకున్నా.. దస్తగిరి సంచలనం! ఆన్లైన్లో వేధింపులు, ట్రోలింగ్లకు పాల్పడితే 5 సంవత్సరాల జైలుతో పాటు జరిమానా ఉంటుందని తెలిపారు. ఉద్దేశపూర్వకంగా ఓ మహిళను లక్ష్యంగా చేసుకుని వేధిస్తే 5 సంవత్సరాల జైలు, జరిమానా ఉంటుందన్నారు. ఎవరైనా సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు, రెండు వర్గాల మధ్య విభేదాలకు దారితీసే అంశాలు, విద్వేషాలు పెంచే సమాచారాన్ని వైరల్ చేస్తూ పోస్టులు పెడితే వాట్సప్ నంబర్ 90300 04969 కు ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని కామెంట్స్ చేశారు. ఈ సందర్భంగా ఆ నంబర్ కు సంబంధించిన వాల్ పోస్టర్ ను ఎస్పీ ఆవిష్కరించారు. #online-harassment మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి