AP News: అబార్షన్ చేయించుకోవాలని అత్తింటి వేధింపులు.. ప్రాణాలు తీసుకున్న గర్భిణి AP: పెనమలూరులో విషాదం చోటుచేసుకుంది. రెండోసారి కూడా కూతురు పుడుతుందని.. అబార్షన్ చేసుకోవాలని అత్తమామలు, భర్త ఒత్తిడి చేయడంతో కావ్య శ్రీ అనే 5 నెలల గర్భవతి ఆత్మహత్య చేసుకుంది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపడుతున్నారు By V.J Reddy 02 Jun 2024 in ఆంధ్రప్రదేశ్ క్రైం New Update షేర్ చేయండి Pregnant Women Suicide in Penamaluru: కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గంలో విషాదం చోటుచేసుకుంది. తాడిగడప మున్సిపాలిటీ పరిధిలో యనమలకుదురు గ్రామం లో 5 నెలల గర్భవతి సందు కావ్య శ్రీ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మొదటి కాన్పులో ఆడపిల్లకు జన్మనిచ్చింది కావ్య శ్రీ. కాగా రెండోసారి గర్బం దాల్చడంతో విజయవాడలోని ఓ హాస్పిటల్ లో భర్త శ్రీకాంత్ స్కానింగ్ తీయించాడు. స్కానింగ్ లో ఆడపిల్ల అని తేలడంతో అబార్షన్ చేయించుకోవాలని కావ్యను భర్త శ్రీకాంత్ ఒత్తిడి చేశాడు. ఇష్టం లేదని పలుమార్లు భర్త శ్రీకాంత్ కు ఆమె చెప్పింది. తమకు వారసుడు ని ఇవ్వాలని అత్త, మామలు కావ్యను వేధింపులకు గురి చేసినట్లు తెలుస్తోంది. శ్యామ్ అనే కానిస్టేబుల్ స్కానింగ్ తీసుకెళ్లాడని బంధువులు ఆరోపిస్తున్నారు. ఆత్మహత్యకు ముందు కావ్య శ్రీ తన భర్తకు మెసేజ్ చేసింది. మీకు వారసుడిని ఇవ్వలేను అని భర్తకు మెసేజ్ చేసింది. పోస్టుమార్టం నిమిత్తం ఉయ్యూరు ప్రభుత్వ ఆసుపత్రులకు ఆమె మృతు దేహాన్ని తరలించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. Also Read: కోలీవుడ్ నటుడు కరుణాస్ బ్యాగ్‌లో 40 బుల్లెట్లు.. చెన్నై ఎయిర్‌పోర్ట్‌లో కలకలం! #penamaluru మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి