World Record: పిట్ట కొంచెం కూత ఘనం అనే పదానికి నిదర్శనం ఈ పాప..!

ఎన్టీఆర్ జిల్లా నందిగామకు చెందిన రమేష్, హోమ దంపతుల కుమార్తె కైవల్య. 4 నెలల వయస్సు లోనే 120 రకాల పక్షులు, కూరగాయలు, పండ్లు, జంతువుల వంటి ఫొటోలను గుర్తు పట్టి నోబెల్ వరల్డ్ రికార్డ్స్ సాధించిందని తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

New Update
World Record: పిట్ట కొంచెం కూత ఘనం అనే పదానికి నిదర్శనం ఈ పాప..!

4 Months Old Baby World Records: పిట్ట కొంచెం కూత ఘనం అనే పదానికి నిదర్శనం ఈ పాప. ఎన్టీఆర్ జిల్లా నందిగామ కు చెందిన రమేష్, హోమ దంపతుల కుమార్తె కైవల్య.  4 నెలల వయస్సు లోనే 120 రకాల పక్షులు, కూరగాయలు, పండ్లు, జంతువులు, పూల ఫోటోలను గుర్తు పట్టడం తల్లి తండ్రులు అయిన తమకు ఆశ్చర్యానికి గురి చేసిందని హర్షం వ్యక్తం చేస్తున్నారు. పుట్టిన నాలుగు నెలల కాలంలోనే ఈ ఘనత సాధించడం తమకు ఎంతో సంతోషంగా ఉందని పాప తల్లిదండ్రులు చెపుతున్నారు.

ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ప్రతి ఒక్కరిలో ఎదో ఒక టాలెంట్ ఉంటుందని తన కూతురు లో ఉన్న టాలెంట్ బయటకు తీయాలనే ఉద్దేశంతో తాను చిన్న వయసులోనే తన పాపకు అన్ని రకాల జంతువులు, కూరగాయలు, ఫ్రూట్స్ ఇతరత్రా వాటిని గుర్తు పట్టే విధంగా తాను చేసిన ప్రయత్నం ఎంతో ఫలితాన్ని ఇచ్చిందని పాప తల్లి హోమ, తండ్రి రమేష్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Also Read: గొర్రెలు కాసుకునే వాడికి మంత్రి పదవి ఇచ్చాడు అన్నారు.. ఎమ్మెల్యే అనిల్ కుమార్ ఎమోషనల్


మూడు నెలల వయసు లో బ్లాక్ అండ్ వైట్ ఫోటోలను చూపించానని పాపలో చురకుతనాన్ని చూసి నాలుగో నెల నుంచి కలర్ ఫోటోలో ఉన్న 120 రకాల జంతువులు పండ్లు, కూరగాయలు, పూలు ఫోటోలను చూపిస్తుంటే పాప వాటిని చేత్తో పట్టుకొని గుర్తు పడుతోందని దీనిని గమనించి తల్లి తండ్రులు ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ కు పంపగా వారు తిరస్కరించారని చెప్పారు.

అయితే, తన పాపకు ఉన్న టాలెంట్ ఎలాగైనా బయటకు తీయాలన్న పట్టుదలతో నోబెల్ వరల్డ్ రికార్డ్స్ కు అప్లై చేసినట్లు తెలిపారు. వారు పాప వీడియో పంపాలని చెప్పాడం తో పాప గుర్తు పట్టే వీడియో లు నోబెల్ వరల్డ్ రికార్డ్స్ కు పంపామని వారం రోజుల వ్యవధిలో వారు పాప టాలెంట్ గుర్తించి వరల్డ్ రికార్డ్స్ కు సెలెక్ట్ అయినట్లు చెప్పడం తో తమ ఆనందానికి అవధులు లేకుండా పోయాయని పాప తల్లిదండ్రులు చెపుతున్నారు. రెండు రోజులు క్రితం నోబెల్ వరల్డ్ రికార్డ్ సంబంధించిన సర్టిఫికెట్, పతాకాన్ని తమకు అందాయని కుటుంబ సభ్యులు తెలిపారు. టాలెంట్ ఉంటే ఎంతటి అవరోదాన్ని అయిన అందుకోవచ్చు అనే దానికి నిదర్శనం మా 4 నెలల పాప కైవల్య అని భావిస్తున్నామన్నారు తల్లి తండ్రులు.

Advertisment
Advertisment
తాజా కథనాలు