బ్రిడ్జి పై నుంచి రైల్వే ట్రాక్ పై పడ్డ బస్సు!

రాజస్థాన్ లో వంతెన పై నుంచి రైల్వే ట్రాక్‌ పై పడిన బస్సు. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు.

New Update
బ్రిడ్జి పై నుంచి రైల్వే ట్రాక్ పై పడ్డ బస్సు!

వంతెన పై వెళ్తున్న బస్సు అదుపు తప్పి కింద ఉన్న రైల్వే ట్రాక్ పై పడడంతో నలుగురు దుర్మరణం పాలయ్యారు. మరో 28 మంది తీవ్రంగా గాయపడ్డారు.  రాజస్థాన్‌ లోని దౌసాలో జైపూర్‌- దౌసా 21 వ నంబర్‌ జాతీయ రహదారి పై సోమవారం తెల్లవారుజామున ఈ ఘోర ప్రమాదం జరిగింది. ప్రమాదానికి గురైన బస్సు..32 మందితో కలిసి హరిద్వార్‌ నుంచి ఉదయ్‌పూర్‌ వెళ్తుంది.

ఉదయం 2 గంటల దాటిన తరువాత దౌసాలోని కలెక్టరేట్‌ సర్కిల్‌ ప్రాంతంలోని రైల్వే ఓవర్‌ బ్రిడ్జ్‌ పై వెళ్తుండగా...వాహనం అదుపు తప్పింది. వంతెన గోడను ఢీకొట్టి..దాదాపు 50 అడుగుల ఎత్తు నుంచి రైలు పట్టాల పై పడింది. అర్థరాత్రి సమయం కావడంతో బస్సులోని వారంతా కూడా గాఢనిద్రలో ఉన్నారు.

ఈ హఠాత్‌ పరిణామంతో ఒక్కసారిగా బస్సు లోపలి వారందరూ భయబ్రాంతులకు గురయ్యారు. ఏం జరిగిందో తెలిసేలోపే ముగ్గురు ప్రయాణికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. చాలా మంది గాయపడ్డారు. తీవ్ర గాయాల పాలైన వారిలో ఒకరు ఆసుపత్రికి తరలించే క్రమంలోనే ఒకరు మృతి చెందారు.

ప్రమాదం గురించి సమాచారం అందుకున్న వెంటనే అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ముందు జాగ్రత్తగా ఆ మార్గంలో రైళ్ల రాకపోకలను కూడా నిలిపివేశారు. బస్సులో చిక్కుకున్న ప్రయాణికుల్ని రక్షించారు. తీవ్రంగా గాయపడిన 12 మందిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. వీరిలో ఒకరు పరిస్థితి విషమంగా ఉన్నందున.. మెరుగైన చికిత్స కోసం జైపూర్​ తరలించారు.ఈ ఘటనపై దర్యాప్తు జరుపుతున్నామని వెల్లడించారు.

Also read: సరికొత్త రికార్డు సృష్టించిన హైదరాబాద్‌ మెట్రో..ఒక్కరోజే ఎంత మంది జర్నీ చేశారంటే!

Advertisment
Advertisment
తాజా కథనాలు