Mantralayam: ప్రపంచంలోనే ఎత్తైన శ్రీరాముని విగ్రహం నిర్మాణానికి శంకుస్థాపన కర్నూలు జిల్లా మంత్రాలయంలో ప్రపంచంలో అత్యంత ఎత్తైన 108 అడుగుల శ్రీరాముని పంచలోహ విగ్రహం నిర్మాణానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా వర్చువల్ విధానం ద్వారా శంకుస్థాపన చేశారు. రూ300కోట్లతో నిర్మించిన ఈ ఆలయం రెండేళ్లలో అందుబాటులోకి రానుంది. By BalaMurali Krishna 23 Jul 2023 in ఆంధ్రప్రదేశ్ కర్నూలు New Update షేర్ చేయండి 108 అడుగుల రాములోరి విగ్రహం నిర్మాణం.. మంత్రాలయంలో శ్రీ రాఘవేంద స్వామి మఠం ఆధ్వర్యంలో అతిపెద్ద రాముడి విగ్రహము నిర్మాణం జరగనుంది. రూ.300 కోట్లతో 108 అడుగుల పంచలోహ శ్రీరాముని విగ్రహ నిర్మాణానికి శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం, జైశ్రీరామ్ ఫౌండేషన్ సంయుక్తంగా శ్రీకారం చుట్టింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా వర్చువల్ విధానం ద్వారా ఈ విగ్రహ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. మంత్రాలయంలో ప్రపంచంలోనే ఎత్తైన శ్రీరాముని విగ్రహం ఏర్పాటుకు శ్రీకారం చుట్టామని రాఘవేంద్ర స్వామి మఠం పీఠాధిపతి సుబుదేంద్ర తీర్థులు Rtvతో తెలిపారు. వనవాస సమయంలో శ్రీ రాముడు ఈ ప్రాంతానికి వచ్చారని.. శ్రీరాముడిని రాఘవేంద్ర స్వామి ఆరాధ్య దైవంగా కొలిచేవారని పేర్కొన్నారు. పది ఎకరాల స్థలంలో రామాలయం.. రెండేళ్లలో 108 అడుగుల పంచలోహ విగ్రహం ముందుగా తయారుచేస్తారు. అనంతరం రామాలయం నిర్మించి అందులో విగ్రహ ప్రతిష్ట చేస్తారు. తుంగభద్రా నది తీరంలో మంత్రాలయం శ్రీరాఘవేంద్రస్వామి మఠం కొలువై ఉంది. మఠానికి కిలోమీటరు దూరంలో పది ఎకరాల స్థలంలో ఆలయ నిర్మాణం చేపట్టనున్నారు. పూర్తి స్థాయి రాతి కట్టడంలా ఈ రామాలయం నిర్మిచనున్నారు. ఈ పది ఎకరాల్లో తిరమల వెంకటేశ్వరస్వామి, కాశీ విశ్వనాథుడు, సింహాచలం నరసింహస్వామి, బద్రీనాథ్ ఆలయం, కేరళలోని అనంత పద్మనాభస్వామి దేవాలయం, బాసర జ్ఞాన సరస్వతి ఆలయాలతో పాటు తదితర రాష్ట్రాల్లో ఉన్న ప్రముఖ ఆలయాలను తలపించే విధంగా చిన్నపాటి ఆలయాలను నిర్మాణం చేస్తారు. రాఘవేంద్రస్వామి ఆరాధ్యదైవం శ్రీరాముడు.. రాఘవేంద్రస్వామికి శ్రీరాముడు ఆరాధ్యదైవంగా ఉండేవారు. అందుకే మంత్రాలయంలో శ్రీరాముని విగ్రహ ఏర్పాటుకు పది ఎకరాలు కేటాయించామని రాఘవేంద్ర స్వామి మఠం పీఠాధిపతి సుబుదేంద్ర తీర్థులు తెలిపారు. దేశంలోనే ప్రఖ్యాతిగాంచిన ఆధ్యాత్మిక క్షేత్రాల్లో మంత్రాలయం ఒక్కటిగా వెలుగొందుతోంది. రాఘవేంద్రస్వామిని దర్శించుకునేందుకు అనేక రాష్ట్రాల నుంచి భక్తులు వేల సంఖ్యలో ఇక్కడకి వస్తుంటారు. ఇప్పుడు రామాలయం నిర్మాణంతో మరింత ఆధ్యాత్మిక శోభ సంతరించుకోనుంది. మంత్రాలయం పురాతన పేరు మంచాల గ్రామం. ఈ గ్రామానికి మంచాలమ్మ గ్రామదేవతగా ఉండేవారు. అయితే రాఘవేంద్రస్వామిని ఈ గ్రామంలోనే ఉండాలని ఆజ్ఞాపించారట. అప్పట నుంచి స్వామి ఇక్కడే ఉంటూ బృందావనస్థులు అయ్యారు. అప్పటి నుంచి ఈ మఠం కాలక్రమంలో మంత్రాలయంగా మారిందని చెబుతుంటారు. ఇక్కడికొచ్చే భక్తులు ముందుగా మంచాలమ్మను దర్శించుకుని అనంతరం రాఘవేంద్రస్వామి బృందావనాన్ని దర్శించుకుంటారు. #NULL మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి