Ferry Sink In Nile River : నైలు నదిలో పడవ ప్రమాదం.. 10 మంది మృతి!

ఈజిప్టు రాజధాని సమీపంలోని నైలు నదిలో పడవ మునిగిపోవడంతో అందులో ఉన్న 15 మందిలో 10 మంది మరణించారు. ఈ మేరకు సోమవారం అధికారులు సమాచారం అందించారు. ప్రమాదంలో ఐదుగురు ప్రాణాలతో బయటపడగా వారిని ఆసుపత్రికి తరలించినట్లు మానవశక్తి మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.

New Update
Ferry Sink In Nile River : నైలు నదిలో పడవ ప్రమాదం.. 10 మంది మృతి!

Nile River : ఈజిప్టు(Egypt) రాజధాని సమీపంలోని నైలు నది(Nile River) లో పడవ మునిగిపోవడం(Ferry Sink) తో అందులో ఉన్న 15 మందిలో 10 మంది మరణించారు. ఈ మేరకు సోమవారం అధికారులు సమాచారం అందించారు. ప్రమాదంలో ఐదుగురు ప్రాణాలతో బయటపడగా వారిని ఆసుపత్రికి తరలించినట్లు మానవశక్తి మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.

అనంతరం వారు ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం, పడవ మునిగిపోవడానికి కారణం తెలియలేదు. మృతుల కుటుంబాలకు 2 లక్షల ఈజిప్షియన్ పౌండ్లు (దాదాపు 6,466 డాలర్లు) , గాయపడిన వారికి 20 వేల ఈజిప్షియన్ పౌండ్లు (సుమారు 646 డాలర్లు) పరిహారాన్ని మంత్రిత్వ శాఖ అందించింది.

రోజువారీ కూలీలు స్థానిక నిర్మాణ సంస్థలో పని చేసేందుకు పడవలో వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు స్థానిక మీడియా పేర్కొంది. మృతదేహాలను గుర్తించేందుకు రెస్క్యూ సిబ్బందికి గంటల తరబడి పట్టిందని చెప్పారు. ఈ ఘటన గిజాలోని మోన్‌షాత్-అల్-కనాటర్ నగరంలో చోటుచేసుకుంది. గ్రేటర్ కైరో(Greater Cairo) లోని మూడు ప్రావిన్సులలో గిజా ఒకటి.

రెస్క్యూ బృందాలు బాధితుల మృతదేహాలను వెలికితీయడంలో సవాళ్లను ఎదుర్కొన్నాయి. సెర్చింగ్‌ ఆపరేషన్ పూర్తి కావడానికి చాలా సమయం పట్టింది. రవాణా కోసం పడవలపై ఆధారపడే ఈజిప్షియన్లు ముఖ్యంగా ఎగువ ఈజిప్ట్, నైలు డెల్టా వంటి ప్రాంతాలలో రోజువారీగా ఎదుర్కొనే ప్రమాదాలను ఈ సంఘటన మరోసారి వెలుగులోకి తీసుకొచ్చింది.

Also Read : మూతపడిన థియేటర్‌ ను మల్టీప్లెక్స్ గా మార్చబోతున్న సూపర్‌ స్టార్‌!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

AP Crime: రైస్ మిల్‌లో విషాదం.. కరెంట్ షాక్‌తో ముగ్గురు మృతి!

ఏపీలో ఘోర విషాదం జరిగింది. తూర్పుగోదావరి జిల్లా కోరుకొండలోని సూర్య మహాలక్ష్మి రైస్ మిల్లులో విద్యుత్ షాక్‌తో ముగ్గురు మృతి చెందారు. మృతులు కాపవరం గ్రామానికి చెందిన శ్రీరాములు, అన్నవరం, వెంకన్నగా పోలీసులు గుర్తించారు. మిల్ యజమానిపై కేసు నమోదు చేశారు.

New Update
rice mill

East Godavari rice mill lectric shock issue

AP Crime: ఏపీలో ఘోర విషాదం జరిగింది. తూర్పుగోదావరి జిల్లా కోరుకొండలోని సూర్య మహాలక్ష్మి రైస్ మిల్లులో విద్యుత్ షాక్‌తో ముగ్గురు మృతి చెందారు. మృతులు కాపవరం గ్రామానికి చెందిన శ్రీరాములు, అన్నవరం, వెంకన్నగా పోలీసులు గుర్తించారు.

ట్రాలీలో రైస్ తీసుకొస్తుండగా..

ఈ మేరకు కోరుకొండ ఎంపీడీవో ఆఫీస్ వెనక రైస్ మిల్ లోకి శనివారం ఉదయం గోడౌన్ నుండి రైస్ ను ట్రాలిలో రైస్ తీసుకుని వస్తుండగా విద్యుత్ వైర్లు తగిలాయి. దీంతో అక్కడికక్కడే మృతులు ఆకుల శ్రీరాములు (34), పలసాని అన్నవరం (55),జాజుల వెంకన్న (46) చనిపోయారు. ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఎమ్మెల్యే బత్తుల బలరామ కృష్ణ.. మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ప్రభుత్వం తరఫున బాధిత కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.5 లక్షల చొప్పున ఇస్తామని తెలిపారు. మృతిపై సమగ్ర విచారణ జరిపి రైస్ మిల్ యజమాన్యంపై, విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంపై చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే బలరామకృష్ణ  తెలిపారు.

ఇది కూడా చూడండి: TG Crime: సిరిసిల్లలో ఘోరం.. తొగొచ్చి తండ్రిని కొట్టి చంపిన కొడుకు!

బాధిత కుటుంబాలను పరామర్శించి ప్రభుత్వం తరఫున రావాల్సిన నష్టపరిహారాన్ని చనిపోయిన మృతుల కుటుంబాలకు ఇవ్వాలని మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా డిమాండ్ చేశారు. యాజమాన్యం నిర్లక్ష్యం పైన, ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి మార్చుకోవాలని, విద్యుత్ అధికారులు వైర్లు కిందకు ఉన్నా పట్టించుకోకపోవడం తో ఈ ప్రమాదం జరిగిందని బాధిత కుటుంబాలు తమముందు కన్నీటి పర్యాంతమయ్యారు. చనిపోయిన కుటుంబాలకు ప్రభుత్వం తరఫునుంచి ఆదుకోవాలని, వైసీపీ తరఫునుంచి కూడా బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని వారిని ఆదుకుంటామని  మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా తెలిపారు. అధికారుల నిర్లక్ష్యం ప్రభుత్వ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుందని ఇలాంటి ఘటన మళ్లీ పునరవృతం కాకుండా ప్రభుత్వం ఇప్పటికైనా సంబంధిత బాధ్యులపై చర్యలు తీసుకోవాలని మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా డిమాండ్ చేశారు.

ఇది కూడా చూడండి: Brain Health: ఈ అలవాట్లు వెంటనే మానెయ్ లేదంటే బ్రెయిన్ షెడ్డుకే..!

 rice | power | shock | today telugu news

Advertisment
Advertisment
Advertisment