పేరుకే జిల్లా ప్రభుత్వాసుపత్రి.. సౌకర్యాలు మాత్రం శూన్యం By Jyoshna Sappogula 27 Nov 2023 in ఆంధ్రప్రదేశ్ పశ్చిమ గోదావరి New Update షేర్ చేయండి Eluru district: ఏలూరు జిల్లా ప్రభుత్వాసుపత్రి(Government Hospital)పై ప్రతిపక్ష పార్టీల నాయకులు విమర్శలు గుప్పిస్తున్నారు. పేరుకే జిల్లా ప్రభుత్వాసుపత్రి.. సౌకర్యాలు మాత్రం శూన్యం అంటూ ధ్వజమెత్తుతున్నారు. జిల్లా ప్రభుత్వాసుపత్రికి ప్రభుత్వ మెడికల్ కాలేజి మంజూరు అయినా వైద్యుల కొరత వెంటాడుతోందని వారు ఆరోపిస్తున్నారు. ఆనారోగ్యంతో వచ్చిన బాధితులకు చికిత్స చేసేవారు సరిగా అందుబాటులో లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారని మండిపడుతున్నారు. కాస్తా సీరియస్ అయిన వైద్య కేసులను విజయవాడ, గుంటూరు అంటూ వేరే జిల్లా ప్రభుత్వాసుపత్రులకు తరలిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కరెక్ట్ టైంకు వైద్యం అందకపోవడంతో బాధితులు విలవిలలాడుతున్నారంటున్నారు. Also Read: ముచ్చటగా మూడో పెళ్లి చేసుకున్న వైసీపీ ఎమ్మెల్సీ.. ట్విస్ట్ ఎంటంటే..! ఏలూరు జిల్లా ప్రభుత్వాసుపత్రి వైద్యుల కొరతపై అధికారులు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నిస్తున్నారు. నాడు నేడు ద్వారా రంగులు వెయ్యడం తప్ప వైసీపీ ప్రభుత్వం ప్రజల గురించి ఆలోచించడం లేదని దుమ్మెత్తిపొస్తున్నారు. క్షేత్రస్దాయిలోనూ ప్రభుత్వాసుపత్రల అభివృద్ది శూన్యం అంటూ ఆరోపిస్తున్నారు. ఏలూరు జిల్లా అధికార పార్టీ ఎమ్మెల్యే వైద్య శాఖ మంత్రిగా పనిచేసిన ప్రభుత్వాసుపత్రిని మాత్రం అభివృద్ది చేయలేకపోతున్నాడంటూ విరుచుకుపడుతున్నారు. సొంత జిల్లా ఆసుపత్రిని బాగుచేయలేని వాడు రాష్ట్రంలోని ప్రభుత్వాసుపత్రులను ఎలా బాగు చేస్తారని ఫైర్ అవుతున్నారు. ఇప్పటికైన ఏలూరు జిల్లా ప్రభుత్వాసుపత్రి లో వైద్యుల కొరతపై దృష్టి పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. Also Read: అతనే రైతుబంధు ఆపాలని ఈసీఐకి ఫిర్యాదుచేశారు.. హరీష్ రావు ఫైర్.. #andhra-paradesh మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి