Gulf: గల్ఫ్‌ ఏజెంట్ భారీ మోసం.. కార్మికుల పేర్లమీద లోన్లు తీసి!

దుబాయ్‌లో ఉద్యోగాలున్నాయని తీసుకెళ్లి కరీంనగర్, నిజామాబాద్ జిల్లాలకు చెందిన 80 మందిని మోసం చేశాడు గల్ఫ్ ఏజెంట్. దుబాయ్ బ్యాంకుల్లో వారిపేర్లమీద లోన్లు తీసి ఇంటికి పంపించాడు. బ్యాంకునుంచి EMI కట్టాలంటూ ఫోన్లు రావడంతో ప్రవాసీ ప్రజావాణిని ఆశ్రయించారు. 

New Update
dubai agent

Gulf agent cheated workers in Telangana

Gulf Agent: తెలంగాణలో ఓ గల్ఫ్‌ ఏజెంట్‌ భారీ మోసానికి పాల్పడ్డాడు. ఉద్యోగం, భారీ జీతం పేరిట వందలమందిని ఏడారి దేశం తీసుకెళ్లి నట్టేటా ముంచేశాడు. దుబాయ్ బ్యాంకుల్లో అమాయకులపేర్లమీద లక్షల్లో లోన్లు తీసి.. కొద్ది రోజుల్లోనే వారందరినీ భయాందోళనకు గురిచేసి ఇంటికి పంపించాడు. గ్రామానికి చేరిన వారంలోనే EMI కట్టాలంటూ దుబాయ్ బ్యాంకుల నుంచి ఫోన్లు రావడంతో ఉలిక్కిపడ్డారు. ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితిలో న్యాయం చేయాలంటూ నిజామాబాద్‌, కరీంనగర్‌, జగిత్యాల, నిర్మల్‌ ప్రాంతాలకు చెందిన 80 మంది ప్రజాభవన్‌లోని ప్రవాసీ ప్రజావాణిని ఆశ్రయించగా సంచలన నిజాలు బయటపడ్డాయి. 

విజిట్‌ వీసాపై తీసుకెళ్లి..

ఈ మేరకు నిజామాబాద్‌ దుండిగుళ్ల భూమేశ్వర్‌ ప్రాంతానికి చెందిన 80 మందిపి విజిట్‌ వీసాపై ఓ ఏజెంట్ గల్ఫ్‌ తీసుకెళ్లాడు. ముందగా కొన్ని నెలలు పలు కంపెనీల్లో ఉద్యోగం, వసతి ఇప్పించాడు. ఆ తర్వాత నెమ్మదిగా ఇజ్రాయెల్‌లో భారీ జీతాలిస్తారని, పని కూడా తక్కువనేంటూ నమ్మించాడు. ఇందుకోసం అగ్రిమెంట్ ఉంటుందని, వాటిపై సంతకం చేయాలంటూ బ్యాంకు పేపర్లపై వేలుముద్రలు వేయించాడు. దుబాయ్ లో తనకు ఒక సబ్‌ ఏజెంట్‌ను నియమించుకుని.. 30 మంది పేర్లమీద ఒక్కొక్కిరికి రూ.6 లక్షలు మొత్తం రూ.30 లక్షల తీసుకున్నాడు. హవాలా మార్గంలో ఆ డబ్బును ఇంటికి పంపించేవాడు. 

ఇది కూడా చదవండి: USA: ఒకవైపు మంచు తుఫాను..మరోవైపు కార్చిచ్చు..అల్లాడిపోతున్న అమెరికా

EMI కట్టాలంటూ దుబాయ్ నుంచి ఫోన్లు..

అయితే నెలలు గడుస్తుంటంతో ఎలాంటి సమాచారం ఇవ్వకపోవడంతో బాధితులంతా ప్రశ్నించడం మొదలుపెట్టారు. దీంతో పలు కారణాల వల్ల ఉద్యోగాలు రాలేదని, అందరూ ఇండియాకు తిరిగివెళ్లిపోవాలని చెప్పాడు. దుబాయి పోలీసులు జైలులో వేస్తారని బెదింరించాడు. చేసేదేమిలేక అందరూ వచ్చేశారు. ఇక్కడివరకు బాగానే ఉన్నా.. దుబాయ్ బ్యాంకు అధికారులు ఫోన్‌ చేసి ‘ఈఎంఐలు చెల్లించండి’ అంటూ అడగటంతో బాధితులు కంగుతిన్నారు. నిందితుడికి ఫోన్ చేస్తే ఎలాంటి రెస్పాన్స్ లేకపోవడంతో తాము మోసపోయామని ప్రవాసీ ప్రజావాణి ఇన్‌చార్జి చిన్నారెడ్డి, నోడల్‌ అధికారి దివ్యలను కలిసి ప్రజావాణిలో కంప్లైట్ ఇచ్చారు. 

ఇది కూడా చదవండి: కూటమికి కటీఫ్.. TTD చైర్మన్ క్షమాపణ చెప్పాల్సిందే: పవన్ సంచలనం

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు