Telangana: విషాదం.. బహ్రెయిన్‌లో తెలంగాణ యువకుడు ఆత్మహత్య
గల్ఫ్‌కు వెళ్లి తమ కుటుంబాన్ని ఆదుకుంటాడని భావించిన ఓ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఉపాధి పని కోసం వెళ్లిన జగిత్యాల యువకుడు బహ్రెయిన్‌లో ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది.
గల్ఫ్‌కు వెళ్లి తమ కుటుంబాన్ని ఆదుకుంటాడని భావించిన ఓ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఉపాధి పని కోసం వెళ్లిన జగిత్యాల యువకుడు బహ్రెయిన్‌లో ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది.
ఏపీలోని ఏలూరు జిల్లాకు చెందిన సుమ అనే మహిళ 3 నెలల క్రితం కువైట్‌లో వెళ్లింది. ప్రస్తుతం అనారోగ్య సమస్యలతో బాధపడుతోంది. యజమానికి ఇండియాకు పంపించకుండా ఆమెను హింసిస్తున్నాడు. సుమను ఇండియాకు తీసుకురావాలని ఆమె కుటుంబం కోరుతోంది.
అమెరికాకు వ్యతిరేకంగా ఇరాన్ దాడులు చేపట్టింది. ట్రంప్ యుద్ధం ముగిసిందని ప్రకటించింది కానీ ఇరాన్ మాత్రం ఏం లేదు అని చెబుతోంది. గల్ఫ్ కంట్రీస్ లో ఇరాన్ దాడులు చేస్తున్న కారణంగా అవన్నీ తమ గగనతలాలను మూసేశాయి.
గల్ఫ్చట్టాలకు విరుద్ధంగా అనుమతి లేకుండా మత ప్రచారం చేస్తున్న క్రైస్తవ మతప్రచారకులను ఖతర్‌లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరంతా విజిటింగ్ వీసాపై ఖతర్ వెళ్లి అక్కడ మత ప్రచారం చేస్తున్నారని పోలీసులు ఆరోపిస్తున్నారు. వారిలో ఐదుగురు తెలుగువారు ఉన్నారు.
గల్ఫ్ దేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మిస్తూ మోసం చేస్తున్న ఓ ట్రావెల్స్ నిర్వహకుల గుట్టు రట్టయింది. ఏకంగా ఎమ్మెల్యేకు పోన్ చేసి ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పడంతో కంగుతినడం ఆయన వంతయ్యింది. వెంటనే పోలీసులను అప్రమత్తం చేయడంతో వారిని అరెస్ట్ చేశారు.
ఉద్యోగం కోసం బహ్రెయిన్‌కు వెళ్లిన ఓ వ్యక్తి.. తన పాస్‌పోర్టు పోగొట్టుకొని ఏకంగా 42 ఏళ్ల పాటు అక్కడే ఉండిపోయాడు. తాజాగా ఇండియకు తిరిగివచ్చారు. ఇంతకీ ఏం జరిగిందో తెలియాలంటే పూర్తి సమచారం కోసం టైటిల్‌పై క్లిక్ చేయండి.
ఇకనుంచి సౌదీ అరేబియా వెళ్లాలనుకునేవారికి చేదు వార్త అందింది. భారతీయ కార్మికులను సంఖ్యను నియంత్రించే దిశగా అక్కడి ప్రభుత్వం కఠినమైన రూల్స్ తీసుకొచ్చింది. దీని గురించి పూర్తి సమాచారం తెలుసుకునేందుకు ఈ ఆర్టికల్ చదవండి.
దుబాయ్‌లో ఉద్యోగాలున్నాయని తీసుకెళ్లి కరీంనగర్, నిజామాబాద్ జిల్లాలకు చెందిన 80 మందిని మోసం చేశాడు గల్ఫ్ ఏజెంట్. దుబాయ్ బ్యాంకుల్లో వారిపేర్లమీద లోన్లు తీసి ఇంటికి పంపించాడు. బ్యాంకునుంచి EMI కట్టాలంటూ ఫోన్లు రావడంతో ప్రవాసీ ప్రజావాణిని ఆశ్రయించారు.