'నా వీర్యం వాడుకోండి, ఖర్చులు భరిస్తా'.. టెలిగ్రాం సీఈవో ఆసక్తికర వ్యాఖ్యలు
ప్రముఖ మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్ ఫౌండర్, CEO పావెల్ దురోవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. 37 ఏళ్ల లోపు మహిళలు తన వీర్యాన్ని వాడుకొని IVF చేయించుకుంటే ఖర్చులు భరిస్తానని తెలిపారు.
ప్రముఖ మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్ ఫౌండర్, CEO పావెల్ దురోవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. 37 ఏళ్ల లోపు మహిళలు తన వీర్యాన్ని వాడుకొని IVF చేయించుకుంటే ఖర్చులు భరిస్తానని తెలిపారు.
15మంది ప్రాణాలు తీసిన ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్ పక్కా స్కెచ్ ప్రకారం జరిగిందని ఎన్ఐఏ అధికారులు చెబుతున్నారు. సిరియన్ హ్యాండర్లు, టర్కీ సమావేశాలు, టెలీగ్రామ్ లో ట్యూటోరియల్స్ తో ఉగ్రవాదులు కట్టుదిట్టంగా ప్లాన్ చేశారని కనుగొన్నారు.
కంటెంట్ క్రియేటర్ల కోసం టెలిగ్రామ్ అంతర్జాతీయ పోటీకి సిద్ధమైంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కంటెంట్ క్రియేటర్ల కోసం తొలిసారి ఈ పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపింది. కాగా ఈ కాంటెస్ట్‌లో గెలుపొందితే 50,000 డాలర్ల విలువల చేసే బహుమతులు అందజేస్తామని తెలిపింది.
టిక్‌టాక్, టెలిగ్రామ్ యాప్స్‌ను పాకిస్తాన్ బ్యాన్ చేసినట్లు ఇండియా టీవీ కథనం పేర్కొంది. మతపరమైన సూత్రాలకు విరుద్ధంగా ఉండే కంటెంట్, జాతీయ భద్రత, సాంస్కృతిక విలువల దృష్ట్యా పాక్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు మీడియా కథనాలు పేర్కొంటున్నాయి.
ఇటీవల టెలిగ్రామ్ చీఫ్ పావెల్ దురోవ్ అరెస్టయిన నేపథ్యంలో.. భారత ప్రభుత్వం ఈ యాప్‌పై దృష్టి సారించింది. ఈ యాప్‌లో జరుగుతున్న మోసాలు, అక్రమాలు, గ్లాంబ్లింగ్ వంటి నేరపూరిత చర్యలపై ప్రభుత్వం విచారణ చేస్తున్నట్లు పలువురు ప్రభుత్వ అధికారులు వెల్లడించారు.
టెలిగ్రామ్ సీఈవో పావెల్ దురోవ్‌ను పారిస్‌లో OFMIN అరెస్ట్ చేసింది. టెలిగ్రామ్ ద్వారా నేరాలను నిరోధించడంలో విఫలం కావడంతో పాటు మాదకద్రవ్యాల అక్రమ రవాణా, సైబర్ బెదిరింపులు వంటి ఆరోపణలతో దురోవ్‌ను అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. దురోవ్‌ను ఈరోజు కోర్టులో ప్రవేశపెడతారు.
టెలిగ్రామ్ వినియోగదారులను ఆందోళనకు గురిచేసే జీరో-డే భద్రతా సమస్యను భద్రతా పరిశోధకులు కనుగొన్నారు. యూజర్స్ ఇతరులతో చాట్ చేస్తున్నప్పుడు హ్యాకర్లు ఫేక్ వీడియో కానీ,ఫైల్ ని కానీ పంపి డేటాను దొంగిలించే ప్రమాదముందని వారు వెల్లడించారు.
ఒకటి రెండ్రోజుల్లో నీట్-పీజీ పరీక్షల కొత్త షెడ్యూల్‌ను ప్రకటిస్తామని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు. నీట్-పీజీ పరీక్ష ప్రశ్నపత్నం డార్క్ నెట్లో లీకైందని, టెలిగ్రామ్ యాప్‌లో షేర్ చేశారని చెప్పారు. ఈ వ్యవహారంపై సీబీఐ దర్యాప్తు చేస్తోందన్నారు.
టెలిగ్రామ్ లో సినిమాలు చూసేవారికి కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో పనిచేస్తున్న సైబర్ దోస్త్ హెచ్చరికలు జారీ చేసింది. కొత్త సినిమాలకు థంబ్‌నైల్స్ పెట్టి సైబర్ లింకులను అటాచ్ చేస్తున్నారని తెలిపింది. ఆ లింక్స్ ఓపెన్ చేయగానే సైబర్ నేరగాళ్లకు మన సమాచారం అంతా వెళ్తుందని పేర్కొంది.