అమెరికాకు బిగ్ షాక్.. విదేశాల నుంచి దిగుమతులు.. స్థానిక కరెన్సీల్లోనే చెల్లింపులు
గల్ఫ్ దేశాల్లో వాణిజ్య చెల్లింపులకు సంబంధించి భారత్ కీలక నిర్ణయం తీసుకోనుంది. ఆయా దేశాల స్థానిక కరెన్సీల్లోనే చెల్లింపులు చేసే మార్గాలు అన్వేషిస్తోంది.
గల్ఫ్ దేశాల్లో వాణిజ్య చెల్లింపులకు సంబంధించి భారత్ కీలక నిర్ణయం తీసుకోనుంది. ఆయా దేశాల స్థానిక కరెన్సీల్లోనే చెల్లింపులు చేసే మార్గాలు అన్వేషిస్తోంది.
మతపరమైన ఊరేగింపులు, సాంస్కృతిక కార్యక్రమాల ఊరేగింపుల్లో డీజీ పాటలు, ఐటం సాంగ్స్ పెడుతుంటారు. చెవులు చిల్లులు పడేలా మోత మోగిస్తుంటారు.అయితే ఇలాంటి కార్యక్రమాల్లో డీజే పాటలు, ఐటం సాంగ్స్‌ను వినిపించే డీజేలపై నిషేధం విధించాలని కర్ణాటక ప్రభుత్వం భావిస్తోంది.
కశ్మీర్ మంచు తుఫాను బీభత్సం సృష్టిస్తోంది. గత రెండ్రోజులుగా మంచు తుఫానుతో పాటు వర్షం కూడా కురుస్తోంది. దీంతో జమ్మూ కశ్మీర్ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జన జీవనం స్తంభించిపోయింది. మార్చి 20 దాకా ఇలాంటి వాతావరణమే ఉంటుందని IMD ప్రకటించింది.
అన్నాడీఎంకే ఎంపీ షణ్ముగన్ సీఎం స్టాలిన్‌పై విమర్శలు చేస్తూ నోరు జారారు. నాకు నయనతార కావాలి.. నా కల నెరవేరుస్తారా '' అంటూ ప్రశ్నించారు. హీరోయిన్‌పై ఆయన చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.
పశ్చిమ బెంగాల్లో సోమవారం బీజేపీ.. 144 మంది అభ్యర్థులు జాబితాను ప్రకటించిన సంగతి తెలిసిందే. మంగళవారం టీఎంసీ పార్టీ అభ్యర్థుల పూర్తి జాబితాను విడుదల చేసింది. 294 స్థానాలకు 291 స్థానాల్లో టీఎంసీ అభ్యర్థులు బరిలోగి దిగనున్నారు.
దేశవ్యాప్తంగా అనేక గ్యాస్ కొరత కొనసాగుతోంది. దీంతో తాజాగా ఎల్పీజీ సీలిండర్ల అక్రమ దందా వెలుగులోకి వచ్చింది. ఢిల్లీలోని ముండ్కా ప్రాంతంలో ఓ గోదాంపై అక్కడి పోలీస్ క్రైమ్ బ్రాంచ్ సోదాలు చేసింది. ఈ దాడుల్లో ఏకంగా 610 LPG సిలిండర్లను సీజ్ చేశారు.
దేశంలోని అనేక ప్రాంతాల్లో గ్యాస్ కొరత నెలకొంది. దీంతో నగరాలు, పట్టణాల్లో పలు హోటళ్లు, రెస్టారెంట్లు మూసివేశారు. మరికొన్నింట్లో కస్టమర్లకు పరిమితంగానే మెనూ అందిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం భారీ ఊరట కల్పించింది.
ఎన్నికల షెడ్యూల్ విడుదలైన కొన్ని గంటల్లోనే కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. పశ్చిమ బెంగాల్ డీజీపీ, చీఫ్ సెక్రటరీ సహా నలుగురు వ్యక్తులపై ఎన్నికల సంఘం వేటు వేసింది. ఈ పదవుల్లో కొత్తవాళ్లను నియమించాలని ఆదేశించింది.
పశ్చిమ బెంగాల్‌కు సంబంధించి 'ఓట్‌వైబ్' అనే పోల్ ఏజెన్సీ విడుదల చేసిన సర్వే ఫలితాలు ఆసక్తి రేపుతున్నాయి. సర్వే వివరాల ప్రకారం.. పశ్చిమ బెంగాల్ ఓటర్లలో 42 శాతం మంది సీఎంగా మళ్లీ మమతా బెనర్జీయే కావాలని అభిప్రాయం వ్యక్తం చేశారు.