/rtv/media/media_files/2026/03/16/commercial-lpg-cylinders-2026-03-16-17-04-09.jpg)
Commercial LPG cylinders
దేశంలోని అనేక ప్రాంతాల్లో గ్యాస్ కొరత నెలకొంది. దీంతో నగరాలు, పట్టణాల్లో పలు హోటళ్లు, రెస్టారెంట్లు మూసివేశారు. మరికొన్నింట్లో కస్టమర్లకు పరిమితంగానే మెనూ అందిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం భారీ ఊరట కల్పించింది. కేంద్ర పెట్రోలియం శాఖ ఆదేశాల మేరకు కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ల పంపిణీ ప్రక్రియ అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ప్రారంభమయ్యింది. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం చమురు మార్కెటింగ్ కంపెనీలు (OMC) రోజువారి సగటు వినియోగంలో 20 శాతం వరకు నియంత్రిత పంపిణీ కోసం కేటాయింపులు చేశాయి.
Also Read: పశ్చిమ బెంగాల్ ఎన్నికలకు ముందు బిగ్ ట్విస్ట్.. ఈసీ సంచలన నిర్ణయం
ఢిల్లీ లాంటి పలు మెట్రో నగరాల్లో రోజుకు 1800 వరకు సిలిండర్లను పంపిణీ చేయనున్నారు. పంపిణీ విధానంలో అయిదు స్థాయిలకు ప్రాధాన్యతలను నిర్ణయించారు. మొదటి స్థాయిలో ఆస్పత్రులు, విద్యాసంస్థలు, రెండో స్థాయిలో రైల్వేలు, విమానాశ్రయాలకు ప్రాధాన్యత ఇచ్చారు. మూడో స్థాయిలో రెస్టారెంట్లు,మెస్‌లకు నాలుగో స్థాయిలో హోటళ్లు, గెస్ట్ హౌస్‌లు, ట్రస్టులకు కేటాయించారు. చివరగా అయిదో స్థాయిలో డెయిరీలు, బేకరీలు, స్వీట్ షాపులకు ప్రాధాన్యత ఇచ్చారు.
Also Read: యుద్ధం గురించి దుష్ప్రచారం.. దుబాయ్‌లో 19 మంది భారతీయులు అరెస్ట్
ఇప్పటికే ఢిల్లీ, హర్యానా, రాజస్థాన్, బిహార్ తదితర రాష్ట్రాలు దీనికి సంబంధించి అధికారిక ఉత్తర్వులు జారీ చేశాయి. గృహ వినియోగ గ్యాస్ మళ్లింపులు నియంత్రించేందుకు, అలాగే వాణిజ్య అవసరాలకు అంతరాయం లేకుండా చేసేందుకే తాము ఈ నిర్ణయం తీసుకున్నామని పెట్రోలియం శాఖ నిర్ణయించింది. ఈ విధానం వల్ల పండుగల సీజన్‌లో వాణిజ్య గ్యాస్ కొరత లేకుండా ఉంటుందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.
Follow Us