/rtv/media/media_files/2026/03/16/delhi-2026-03-16-21-33-55.jpg)
Delhi Crime Branch busts illegal LPG storage, seizes 610 gas cylinders
దేశవ్యాప్తంగా అనేక గ్యాస్ కొరత కొనసాగుతోంది. దీంతో తాజాగా ఎల్పీజీ సీలిండర్ల అక్రమ దందా వెలుగులోకి వచ్చింది. ఢిల్లీలోని ముండ్కా ప్రాంతంలో ఓ గోదాంపై అక్కడి పోలీస్ క్రైమ్ బ్రాంచ్ సోదాలు చేసింది. ఈ దాడుల్లో ఏకంగా 610 LPG సిలిండర్లను సీజ్ చేశారు. ఆ గోదాంలో ఇండేన్, భారత్ గ్యాస్, హెచ్‌పీ గ్యాస్ కంపెనీల సిలిండర్లను కొందరు దుండగులు అక్రమంగా నిల్వ చేసి బ్లాక్ మార్కెట్‌లో అమ్ముతున్నారు. పక్కా సమాచారం మేరకు సోమవారం ఢిల్లీ పోలీసులు అక్కడ సోదాలు చేసి సిలిండర్లను సీజ్ చేశారు.
Illegal activities amid reports of LPG supply disruptions and black-marketing across the capital, the Crime Branch of Delhi Police has busted a large-scale racket involving the unauthorized storage and black-marketing of LPG cylinders in the Mundka area of Outer Delhi. pic.twitter.com/Khe8FTbcb6
— NextMinute News (@nextminutenews7) March 16, 2026
Also Read: ఎల్పీజీ, సీఎన్‌జీ, పీఎన్‌జీ.. అన్ని గ్యాస్‌లే...కానీ, తేడాలేంటో తెలుసా?
పశ్చిమాసియాలో యుద్ధం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇరాన్ హర్ముజ్ జలసంధిని మూసివేయడంతో ప్రపంచ ఇంధన సరఫరాలో అంతరాయం ఏర్పడింది. కానీ భారత్‌లో ఎల్‌పీజీ సరఫరా సాధారణంగానే కొనసాగుతోందని కేంద్రం తెలిపింది. పెట్రోలియం, సహజవాయి మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి సుజాత దీనిపై మాట్లాడారు. దేశవ్యాప్తంగా అన్ని రిఫైనరీలు పూర్తి సామర్థ్యంతో పనిచేస్తున్నాయని తెలిపారు. ఎక్కడా కూడా గ్యాస్ సరఫరా ఆగిపోయిన ఘటనలు జరగలేదని స్పష్టం చేశారు.
Also Read: మమతా బెనర్జీపై సువేందు పోటీ.. బీజేపీ అభ్యర్థుల తొలి జాబితా విడుదల
ఇళ్లల్లోకి నిరంతరాయంగా LPGని సరఫరా చేసేలా కేంద్రం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. అంతేకాదు వినియోగదారులు అవసరమైతే పైప్ నేచురల్ గ్యాస్ (PNG) కనెక్షన్లకు మారాలని ప్రభుత్వం సూచిస్తోంది. మరోవైపు గత కొన్ని రోజులుగా గ్యాస్ కొరత ఆందోళనలు కొనసాగుతుండగా.. వివిధ ప్రాంతాల్లో అక్రమ దందా సాగుతోంది. LPG సిలిండర్లను అక్రమంగా నిల్వ చేయడం, బ్లాక్ మార్కెట్‌లో అమ్మడం లాంటి వాటిపై పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు.
Follow Us