/rtv/media/media_files/2026/03/21/supreme-court-2026-03-21-11-59-29.jpg)
Supreme Court pulls up husband while hearing divorce case
భార్య వంట చేయని కారణంతో విడాకుల కోరిన ఓ వ్యక్తికి సుప్రీంకోర్టు గట్టి కౌంటర్ ఇచ్చింది. వంట పని, ఇల్లు శుభ్రం చేయడం, బట్టలుతకడం వంటి పనుల్లో భార్యతోపాటు భర్తకు కూడా సమాన బాధ్యత ఉంటుందని తెలిపింది. ఈ పనులను భర్త కూడా పంచుకోవాలని హితువు పలికింది. భార్య అంటే జీవిత భాగస్వామని.. పని మనిషి కాదంటూ వ్యాఖ్యానించింది. క్రూరత్వం ఆరోపణల ఆధారంగా దిగువ కోర్టు విడాకులు మంజూరు చేసింది. ఆ తర్వాత కర్ణాటక హైకోర్టు ఈ తీర్పును కొట్టివేసింది.
Also Read: యుద్ధం కొనసాగుతున్న వేళ బిగ్ ట్విస్ట్.. ఇరాన్ చమురుపై ఆంక్షలు ఎత్తివేసిన అమెరికా
దీన్ని సవాల్ చేస్తూ భర్త సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలోనే శుక్రవారం ఈ పిటిషన్‌పై సుప్రీం ధర్మాసనం విచారణ చేసింది. భార్య వంట చేయని కారణంతో విడాకులు కోరడం సరికాదంటూ తేల్చిచెప్పింది. ఇంటి పనులు చేయడంలో భార్యతో పాటు భర్తకు కూడా భాగస్వామ్యం ఉంటుందని పేర్కొంది. ప్రభుత్వ స్కూల్‌లో పనిచేస్తున్న దంపతులకు 2017 మేలో వివాహం జరిగింది. 2019 నుంచి వీళ్లిద్దరూ వేరుగా ఉంటున్నారు. వీళ్ల మధ్య రాజీ కుదర్చడం కోసం ప్రయత్నాలు చేసినా అవి విఫలమయ్యాయని పిటిషనర్ తరఫు లాయర్ చెప్పారు.
Also Read: గ్యాస్ సిలిండర్ లేకుండానే… 10 ఏళ్లుగా గ్యాస్‌తో ఉచితంగా వంట!
క్రూరత్వం ఆరోపణలపై హైకోర్టు ఈ పిటిషన్‌ను కొట్టివేసిందన్నారు. క్రూరత్వం ఆరోపణలు ఏంటి అని సుప్రీం ధర్మాసనం ప్రశ్నించింది. దీనికి లాయర్ స్పందిస్తూ భార్య ప్రవర్తన బాగోలేదు, ఆమెకు వంటరాదు అని తెలిపారు. దీంతో హైకోర్టు తీసుకున్న నిర్ణయం సరైందేనని కోర్టు స్పష్టం చేసింది. ఈ విషయాన్ని క్రూరత్వంగా పరిగణించలేమని పేర్కొంది. మీరు పెళ్లి చేసుకుంది జీవిత భాగస్వామినని.. వంట మనిషిని కాదని తెలిపింది. వాళ్లిద్దరూ ఇక్కడికి రావాలని.. వాళ్లతో మేము మాట్లాడుతామని పేర్కొంది. తదుపరి విచారణను ఏప్రిల్ 27కు వాయిదా వేసింది. అదే రోజున దంపతులు తమ ముందుకు రావాలని చెప్పింది.
Follow Us