West Bengal: పశ్చిమ బెంగాల్‌ ఎన్నికలు.. మమతా బెనర్జీకి షాక్ తప్పదా ?

పశ్చిమ బెంగాల్‌కు సంబంధించి 'ఓట్‌వైబ్‌' అనే పోల్ ఏజెన్సీ విడుదల చేసిన సర్వే ఫలితాలు ఆసక్తి రేపుతున్నాయి. సర్వే వివరాల ప్రకారం.. పశ్చిమ బెంగాల్ ఓటర్లలో 42 శాతం మంది సీఎంగా మళ్లీ మమతా బెనర్జీయే కావాలని అభిప్రాయం వ్యక్తం చేశారు.

New Update
Mamata Benarjee

Mamata Benarjee

కేంద్ర ఎన్నికల సంఘం కేంద్ర ఎన్నికల సంఘం తమిళనాడు, పశ్చిమ బెంగాల్, అస్సాం, కేరళతో పాటు కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేసింది. పశ్చిమ బెంగాల్ ఎన్నికలు ఏప్రిల్ 23, 29న రెండు దశల్లో నిర్వహించనున్నారు. మూడుసార్లు వరుసగా అధికారంలోకి వచ్చిన టీఎంసీ పార్టీ ఈసారి కూడా వస్తుందా లేదా బీజేపీ ఈసారి అధికార పీఠం దక్కించుకుంటుందా అనేదానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఈ క్రమంలోనే తాజాగా 'ఓట్‌వైబ్‌' అనే పోల్ ఏజెన్సీ విడుదల చేసిన సర్వే ఫలితాలు ఆసక్తి రేపుతున్నాయి.    

సర్వే వివరాల ప్రకారం.. పశ్చిమ బెంగాల్ ఓటర్లలో 42 శాతం మంది సీఎంగా మళ్లీ మమతా బెనర్జీయే కావాలని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇక విపక్ష బీజేపీ నేత సువేందు అధికారి వైపు కేవలం 19 శాతం మందే మొగ్గు చూపారు. ఇటీవల అక్కడ ఐప్యాక్‌ కార్యాలయంపై ఈడీ దాడులు జరిగినప్పటికీ.. దీదీపి ప్రజలు మద్దతిస్తున్నారని సర్వే వెల్లడించింది. ముఖ్యంగా ముస్లిం ఓటర్లు టీఎంసీకే సపోర్ట్ చేస్తున్నట్లు తెలిపింది. మరోవైపు ప్రభుత్వ పనితీరుపై మాత్రం ప్రజలు భిన్నంగా స్పందిస్తున్నారు. 34 శాతం మంది మమతా పాలన అద్భుతంగా ఉందని చెప్పగా.. 18 శాతం మంది దారుణంగా ఉందని చెప్పారు.   

Also Read: గ్యాస్ సిలిండర్ పేలి ఇద్దరు చిన్నారులు మృతి.. ఏడుగురికి తీవ్ర గాయాలు!

టీఎంసీకి ఓటర్లు వార్నింగ్‌ కూడా ఇచ్చారు. దాదాపు 36 శాతం మంది నిరుద్యోగం ప్రధాన సమస్యగా ఉందని తెలిపారు. అలాగే మమత పాలనలో అక్రమ వలసలు జరుగుతున్నాయని 47 శాతం మంది నమ్ముతున్నారు. దీంతో ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, యువ ఓటర్లు టీఎంసీకి ప్రత్యామ్నాయంగా ఓటు వేసే అవకాశాలు ఉన్నట్లు సర్వే హెచ్చరించింది. 

ఇదిలాఉండగా కేంద్రం కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరి ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఏప్రిల్ 9న అస్సాం, కేరళ, పుదుచ్చేరిలో పోలింగ్ జరగనుంది. ఏప్రిల్ 23న తమిళనాడులో ఎన్నికలు జరగనున్నాయి. పశ్చిమ బెంగాల్‌లో రెండు దశల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. మొదటి దశ ఏప్రిల్ 23 కాగా.. రెండో దశ ఏప్రిల్ 29న జరగనుంది. నాలుగు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాతంతో కలిపి మే 4న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. అయితే ఈసారి ఏ పార్టీ అధికారంలోకి వస్తుందనేది ఆయా రాష్ట్రాల్లో ఆసక్తి నెలకొంది. 

Also Read: వీసా కోసం వింత డ్రామా.. అమెరికాలో 11 మంది భారతీయులు అరెస్ట్!

Advertisment
తాజా కథనాలు