West Bengal: పశ్చిమ బెంగాల్‌ ఎన్నికలకు ముందు బిగ్‌ ట్విస్ట్.. ఈసీ సంచలన నిర్ణయం

ఎన్నికల షెడ్యూల్ విడుదలైన కొన్ని గంటల్లోనే కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. పశ్చిమ బెంగాల్ డీజీపీ, చీఫ్ సెక్రటరీ సహా నలుగురు వ్యక్తులపై ఎన్నికల సంఘం వేటు వేసింది. ఈ పదవుల్లో కొత్తవాళ్లను నియమించాలని ఆదేశించింది.

New Update
ECI replaces Chief Secretary, Home Secretary, top police officials of Bengal

ECI replaces Chief Secretary, Home Secretary, top police officials of Bengal

కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరి ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. పశ్చిమ బెంగాల్‌లో ఏప్రిల్ 23, 29న రెండు దశల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. ఎన్నికల షెడ్యూల్ విడుదలైన కొన్ని గంటల్లోనే కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. పశ్చిమ బెంగాల్ డీజీపీ, చీఫ్ సెక్రటరీ సహా నలుగురు వ్యక్తులపై ఎన్నికల సంఘం వేటు వేసింది. ఈ పదవుల్లో కొత్తవాళ్లను నియమించాలని ఆదేశించింది.  

రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అయిన నందిని చక్రవర్తిని తొలగిస్తూ ఈసీ ఆదేశాలు జారీ చేసింది. ఈ పదవిలో దుష్యంత్‌ నరియాలను నియమించింది. డీజీపీ పీయూష్ పాండేను తొలగించి సీనియర్ ఐపీఎస్ అధికారి సిధ్‌ నాథ్‌ గుప్తాకు బాధ్యతలు అప్పగించింది. కోల్‌కతా పోలీసు కమిషనర్‌ సుప్రతిమ్ సర్కార్‌ను తొలగించి అజయ్ కుమార్‌ నంద్‌కు బాధ్యతలు అప్పగించింది. అలాగే హోంశాఖ కార్యదర్శి జగదీశ్‌ ప్రసాద్‌ మీనాను తప్పించి ఐఏఎస్ అధికారి అయిన సంఘమిత్ర ఘోష్‌ను నియమించింది. 

Also Read: దుబాయ్ విమానాశ్రయం బంద్: ఎయిర్ ఇండియా విమానాలు రద్దు!

రాష్ట్ర ఎన్నికల కోసం చేపట్టిన సమీక్ష సమావేశం తర్వాత వీళ్లను ఆ పదవుల నుంచి తొలగించాలని నిర్ణయం తీసుకున్నట్లు ఈసీ తెలిపింది. వీళ్లను ఎన్నికలు పూర్తయ్యే వరకు పోలింగ్‌కు సంబంధించిన విధుల్లోకి తీసుకోకూడదని ఆదేశాలు జారీ చేసింది. వెంటనే తమ నిర్ణయాలు అమలు చేయాలని.. మధ్యాహ్నం నాటికి రిపోర్టు సమర్పించాలంటూ రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశించింది. 

మరోవైపు ఈసీ తీసుకున్న నిర్ణయాన్ని మమతా బెనర్జీ తీవ్రంగా ఖండించారు. ఎన్నికల సంఘం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం సాయంత్రం ఆందోళన చేపడుతామని తెలిపారు. ఈ అంశం ఇప్పుడు పశ్చిమ బెంగాల్‌లో రాజకీయ దుమారం రేపుతోంది. ఓటరు జాబిత ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) విషయంలో టీఎంసీ, ఈసీ మధ్య విభేదాలు నెలకొన్న విషయం తెలిసిందే. 

Also Read: స్కూల్ స్టేజ్ పై అమ్మాయిలు టవల్ డ్యాన్స్..  వీడియో వైరల్!

Advertisment
తాజా కథనాలు