Champions Trophy : ఛాంపియన్స్ ట్రోఫీ కోసం ఆస్ట్రేలియా జట్టు ఇదే.. స్టార్ బౌలర్లు ఔట్!
పాకిస్తాన్లో ఫిబ్రవరి 19న ప్రారంభం కానున్న ఛాంపియన్స్ ట్రోఫీ కోసం ఆస్ట్రేలియా తమ తుది 15 మంది సభ్యుల జట్టును ప్రకటించింది. తుది జట్టులో ఐదు మార్పులు చేసింది. రెగ్యులర్ కెప్టెన్ పాట్ కమ్మిన్స్ లేకపోవడంతో స్టీవ్ స్మిత్ జట్టుకు నాయకత్వం వహించనున్నాడు.