Marcus Stoinis: ఇలా చేశావ్ ఏంటీ భయ్యా :  ఆసీస్కు బిగ్ షాక్..  స్టార్ క్రికెటర్ రిటైర్మెంట్

ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు ఆస్ట్రేలియాకు బిగ్ షాక్ తగిలింది.  మార్కస్ స్టోయినిస్ వన్డే అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈ నెల చివర్లో  ప్రారంభం కానున్న ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ కోసం ఎంపిక చేసిన జట్టులో స్టోయినిస్ కూడా సభ్యుడిగా ఉన్నాడు.

New Update
marcus stoinis

marcus stoinis

ఛాంపియన్స్ ట్రోఫీ (Champions Trophy) కి ముందు ఆస్ట్రేలియాకు బిగ్ షాక్ తగిలింది.  మార్కస్ స్టోయినిస్ (Marcus Stoinis) వన్డే అంతర్జాతీయ క్రికెట్ నుంచి వెంటనే రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈ నెల చివర్లో  ప్రారంభం కానున్న ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ కోసం ఎంపిక చేసిన జట్టులో  స్టోయినిస్ సభ్యుడిగా ఉన్నాడు. ఇప్పుడతను సడన్ గా రిటైర్మెంట్ ప్రకటించడం అందర్నీ షాక్ కు గురిచేస్తోంది.

Also Read :  డీప్‌సీక్‌ పై దక్షిణ కొరియా నిషేధం!

Also Read :  అమెరికా వెళ్తామా.. పైకి పోతామా..? అసలేంటీ డాంకీ రూట్ స్టోరీ

ఆస్ట్రేలియా (Australia) తరఫున వన్డే క్రికెట్ ఆడటం ఒక అద్భుతమైన ప్రయాణమని చెప్పిన ఈ 35 ఏళ్ల క్రికెటర్..  రిటైర్మెంట్ అంత తేలికైన నిర్ణయం కాదని,  కానీ వన్డేల నుండి వైదొలిగి నా కెరీర్‌లోని తదుపరి అధ్యాయంపై పూర్తిగా దృష్టి పెట్టడానికి ఇది సరైన సమయం అని నేను నమ్ముతున్నాను అని వెల్లడించాడు.

2015లో ఇంగ్లాండ్‌పై వన్డే అరంగేట్రం చేసిన స్టోయినిస్ ..  74 మ్యాచ్‌ల్లో 93.96 స్ట్రైక్ రేట్‌తో 1495 పరుగులు చేశాడు. ఈడెన్ పార్క్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 146 నాటౌట్ అత్యధిక స్కోరు సాధించాడు. అదే మ్యాచ్‌లో అతను మూడు వికెట్లు కూడా పడగొట్టాడు. ఇక 74 మ్యాచ్‌ల్లో 43.12 సగటుతో 48 వికెట్లు పడగొట్టాడు.  2024 నవంబర్ 10న పెర్త్‌లో పాకిస్థాన్‌తో తన చివరి వన్డే మ్యాచ్‌ ఆడాడు.  2019 ఆస్ట్రేలియన్ క్రికెట్ అవార్డులలో స్టోయినిస్ వన్డే ప్లేయర్ ఆఫ్ ది ఇయర్‌గా ఎంపికయ్యాడు. 

Also Read :  విటమిన్ డి కోసం నెలలో ఎన్నిసార్లు సూర్యరశ్మి అవసరం?

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీకి ఆస్ట్రేలియా జట్టు  

పాట్ కమ్మిన్స్ (కెప్టెన్), అలెక్స్ కారీ, నాథన్ ఎల్లిస్, ఆరోన్ హార్డీ, జోష్ హేజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, మార్నస్ లబుషేన్, గ్లెన్ మాక్స్‌వెల్, మాట్ షార్ట్, స్టీవ్ స్మిత్, మిచెల్ స్టార్క్, మార్కస్ స్టోయినిస్, ఆడమ్ జంపా

Also Read :  హైలెస్సా సాంగ్‌కు దేవీశ్రీ అదిరిపోయే డ్యాన్స్.. విడుదలకు ముందే తండేల్ సక్సెస్ పార్టీ!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు