/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/bumrah-profile1700146502576-jpg.webp)
ఛాంపియన్స్ ట్రోఫీ ఆడే భారత జట్టుకు పెద్ద దెబ్బే తగిలింది. అభిమానులకు నిరాశే ఎదురయింది. టీమ్ లో కీ బౌలర్ గా ఉన్న జస్ప్రీత్ బుమ్రా టోర్నీ నుంచి అవుట్ అయ్యాడు. ఆస్ట్రేలియా టూర్ చివర్లో గాయపడిన బుమ్రా గాయం నుంచి ఇంకా కోలుకోలేదు. ఈ కారణంగా టోర్నీలో ఆడడానికి సిద్ధం లేడని బీసీసీఐ ప్రకటించింది. బుమ్రాకు వెన్ను కింద భాగంలో గాయం అయింది. బుమ్రా స్థానంలో యువ పేసర్ హర్షిత్ రాణాను జట్టులోకి తీసుకున్నట్లు కూడా బోర్డు వెల్లడించింది.
ఆస్ట్రేలియా టూర్ లో గాయం..
ఛాంపియన్స్ ట్రోఫీ కోసం గత టీమ్ ఇండియా జట్టును ప్రకటించింది బీసీసీఐ. ఇందులో బుమ్రాకు చోటు కల్పించారు. అప్పటికే అతను ఫిట్ గా లేడు. కానీ ట్రోఫీ టైమ్ కు కోలుకుంటాడనే ఆశలో సెలెక్ట్ చేశారు. ఆస్ట్రేలియాతో జనవరి 3-5 మధ్య జరిగిన చివరి టెస్టులో బుమ్రా గాయపడ్డాడు. ఈ టెస్ట్ లో రెండో ఇన్నింగ్స్ కూడా ఆడలేకపోయాడు. దాని తరువాత ఇండియాకు వచ్చాక కొన్ని రోజులు రెస్ట్ తీసుకున్నాక జాతీయ క్రికెట్ అకాడమీలో వైద్య బృందం పర్యవేక్షణలో ప్రాక్టీస్ ను మొదలుపెట్టాడు. ఐదుగురితో కూడిన ప్రత్యేక బృందం నేతృత్వంలో ఎంత కసరత్తు చేసినా.. బుమ్రా మ్యాచ్ ఫిట్‌నెస్ సాధించలేకపోయాడు. దీంతో అతను ఆడలేడని తేల్చి చెప్పేశారు.
ఈ నెల 19వ తేదీ నుంచి ఛాంపియన్స్ ట్రోఫీ మొదలవనుంది. ఇప్పటికే అన్ని దేశాల టీమ్ లను ప్రకటించేశారు. ఇందులో ఒకవేళ మార్పులు ఏమన్నా చేసుకోవాలని అనుకున్నా వచ్చే మంగళవారం వరకే టైమ్ ఉంది. దీంతో ఎన్‌సీఏ వైద్య బృందం బుమ్రా ఫిట్‌నెస్‌పై బోర్డుకు తుది నివేదికను సమర్పించింది. గాయం నుంచి పూర్తిగా కోలుకున్నా..ఏ ఇబ్బందీ లేకుండా బౌలింగ్ చేయగలడనే గ్యారంటీ ఇవ్వలేకపోయింది ఎన్సీఏ. దీన్ని పరిగణలోకి తీసుకుని సెలెక్ఠర్లు నిర్ణయం తీసుకోవాలని చెప్పింది. ఒకవేళ కష్టపడి ఆడినా మళ్ళీ గాయం తిరగబెట్టే ఛాన్స్ కూడా ఉండడంతో రిస్క్ తీసుకోవడం మంచిది కాదని చెప్పింది. అలా చేస్తే ఎక్కువ రోజులు జట్టుకు దూరం అయ్యే ప్రమాదం ఉందని చెప్పింది.
Also Read: Maha Kumbh: కుంభమేళాలో ఇప్పటివరకు 12 మంది శిశువులు జననం..మారుమోగుతున్న వారి పేర్లు