/rtv/media/media_files/2025/02/12/RvMBhSYOWVN5NE9BwTsy.jpg)
Australia announce squad
పాకిస్తాన్‌లో ఫిబ్రవరి 19న కరాచీలో ప్రారంభం కానున్న ఛాంపియన్స్ ట్రోఫీ కోసం ఆస్ట్రేలియా తమ తుది 15 మంది సభ్యుల జట్టును ప్రకటించింది. తుది జట్టులో ఐదు మార్పులు చేసింది. రెగ్యులర్ కెప్టెన్ పాట్ కమ్మిన్స్ లేకపోవడంతో స్టీవ్ స్మిత్ జట్టుకు నాయకత్వం వహించనున్నాడు. గాయాల కారణంగా కమ్మిన్స్, హాజిల్‌వుడ్ ఛాంపియన్స్ ట్రోఫీకి దూరం కాగా మిచెల్ మార్ష్ క్రికెట్ కు ఇటీవల వీడ్కోలు పలికాడు. మార్కస్ స్టోయినిస్ కూడా జట్టుకు దూరం అయ్యాడు. దీంతో జట్టులోకి ఐదుగురు కొత్త ఆటగాళ్లకు అవకాశం దక్కంది.
Also read : ఎంతకు తెగించావ్రా.. తన కంటే ఎక్కువ కల్లు గిస్తుండని.. పురుగుల మందు కలిపాడు!
సీన్ అబాట్, బెన్ డ్వార్షుయిస్, జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్, స్పెన్సర్ జాన్సన్, తన్వీర్ సంఘాలకు చోటు కల్పించారు సెలెక్టర్లు. కాగా ఆస్ట్రేలియా జట్టు ఛాంపియన్స్ ట్రోఫీలో తన మొదటి మ్యాచ్ ను ఫిబ్రవరి 22న లాహోర్‌లో ఇంగ్లాండ్‌తో ఆడనుంది. ఇక 2006, 2009లో మాజీ క్రికెటర్ రికీ పాంటింగ్ నాయకత్వంలో ఆసీస్ రెండుసార్లు ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకుంది, 2002లో శ్రీలంకతో కలిసి, 2013లో గెలిచిన భారత్ ఈ టోర్నమెంట్‌లో విజేతలుగా నిలిచాయి.
Also Read : ఎంత పనిచేశావమ్మా.. ఇల్లాలు పెట్టిన దీపం.. రెండు ఇళ్లు దగ్థం!
Introducing our 15-player squad for the 2025 ICC #ChampionsTrophy 👊 pic.twitter.com/Rtv20mhXAW
— Cricket Australia (@CricketAus) February 12, 2025
ఆస్ట్రేలియా ఛాంపియన్స్ ట్రోఫీ జట్టు:
స్టీవ్ స్మిత్ (కెప్టెన్), సీన్ అబాట్, అలెక్స్ కారీ , బెన్ డ్వార్షుయిస్, నాథన్ ఎల్లిస్, జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్, ఆరోన్ హార్డీ, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, స్పెన్సర్ జాన్సన్, మార్నస్ లాబుస్చాగ్నే, గ్లెన్ మాక్స్‌వెల్, తన్వీర్ సంఘ, మాథ్యూ షార్ట్, ఆడమ్ జంపా .
Also Read : Maha Kumbh: కుంభమేళాలో ఇప్పటివరకు 12 మంది శిశువులు జననం..మారుమోగుతున్న వారి పేర్లు