వయస్సుతో సంబంధం లేకుండా ఈ రోజుల్లో చాలా మంది గుండె పోటుతో మరణిస్తున్నారు. తాజాగా కర్ణాటక (Karnataka) లో ఓ చిన్నారి గుండె పోటుతో మృతి చెందింది. కర్ణాటకలోని చామరాజనగర్‌లో ఓ ప్రైవేట్ స్కూల్‌లో చదువుతున్న 8 ఏళ్ల బాలికకు ఒక్కసారిగా గుండె పోటు రావడంతో కుప్పకూలింది. వెంటనే ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందింది. మూడో తరగతి చదవుతున్న ఈ చిన్నారికి ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవు. చదువులో, ఆటల్లో ముందుడేది. కానీ అకస్మాత్తుగా గుండె పోటు వచ్చి మృతి చెందడంతో కుటుంబ సభ్యులు రోధిస్తున్నారు. ఇది కూడా చూడండి: Canada: ఇన్ని గొడవలతో ఇక పోరాడలేను–ట్రూడో పిల్లలకు విషం ఇచ్చి.. ఇదిలా ఉండగా ఇటీవల బెంగళూరలో ఓ కుటుంబం ఆత్మహత్యకు పాల్పడింది. ఉత్తరప్రదేశ్‌కి చెందిన అనుప్ కుమార్ అనే ఓ ఐటీ ఉద్యోగి కుటుంబంతో కలిసి బెంగళూరు (Bangalore) లో ఉంటున్నాడు. ఇతనికి భార్య రాఖీ (35) ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. చిన్నారులకు మొదటిగా విషం ఇచ్చి ఆ తర్వాత భార్యాభర్తలు ఉరి వేసుకున్నారు. ఇది కూడా చూడండి: Keir Starmer:మస్క్ చెప్పేవన్నీ అబద్దాలే..బ్రిటన్ ప్రధాని! ఖర్చులు, ఆర్థిక సమస్యలతో తాళ్లలేక ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. స్థానికులు గమనించి పోలీసులకు తెలియజేయగా.. వెంటనే అక్కడికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. వీరే ఉరి వేసుకున్నారా? లేకపోతే ఎవరైనా చేసి ఇలా ప్లాన్ చేశారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇది కూడా చూడండి:Car Accident: చింటూ టార్చర్ వల్లే చనిపోతున్నాం.. కారు దగ్ధం బాధితులు! ఇది కూడా చూడండి: USA: హెచ్–1 వీసాదారులకు గుడ్ న్యూస్.. స్టాంపింగ్ ఇక అమెరికాలోనే...