Ponguleti: బాంబులు పేలడం స్టార్ట్.. KTR అరెస్ట్‌పై పొంగులేటి సంచలనం!

తెలంగాణ రాజకీయాల్లో బాంబులు పేలడం మొదలైందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఫార్ములా ఈ-కార్ రేస్ కేసులో కేటీఆర్‌కు ఏసీబీ నోటీసులు ఇవ్వడంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తప్పుచేసిన వారు ఎప్పటికీ తప్పించుకోలేరని, ఎప్పటికైనా బయటపడాల్సిందేనన్నారు.

New Update
KTR Ponguleti

Ponguleti srinivas reddy sensational comments on KTR

Ponguleti: తెలంగాణ రాజకీయాల్లో బాంబులు పేలడం మొదలైందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఫార్ములా ఈ-కార్ రేస్ కేసులో కేటీఆర్‌కు ఏసీబీ నోటీసులు ఇవ్వడంపై స్పందించారు. తప్పుచేసిన వారు ఎప్పటికీ తప్పించుకోలేరని, తప్పు ఎప్పటికైనా బయటపడుతుందంటూ సంచలన కామెంట్స్  చేశారు. 

బీఆర్ఎస్ మా టార్గెట్ కాదు..

ఈ మేరకు కేటీఆర్ క్యాట్ పిటిషన్ తెలంగాణ హైకోర్టు కొట్టిన వేసిన సంగతి తెలిసిందే. కాగా ఈప్పు ఒప్పులు తేల్చేది కోర్టులేనని, వ్యవస్థల ముందు బలప్రదర్శన చేయడం కరెక్ట్ కాదంటూ విమర్శలు గుప్పించారు. 'మాకు BRS నాయకులు టార్గెట్ కాదు. మేము ఎవరినీ టార్గెట్ చేయడం లేదు. కేటీఆర్ తప్పు చేయకపోతే కోర్టుకు ఎందుకు వెళ్లారు? కేటీఆర్ మారలేదు.. ఆయన రైటర్ మారినట్లుంది. కొత్త సంవత్సరంలో కేటీఆర్ లో స్పిరిట్ పెరిగింది. కాంగ్రెస్ పార్టీకి బాండ్స్ ఎందుకు ఇచ్చారో.. అప్పుడు అధికారంలో ఉన్న BRS చెప్పాలి. బాండ్స్ మాత్రమే కాదు ఇంకా బయట పడాల్సినవి చాలా ఉన్నాయి. విదేశీ కంపెనీకి వెళ్లిన డబ్బులు ఎవరి ఖాతాకు వెళ్ళాయో తేలాలి. ప్రాంతీయ పార్టీల్లో రిచేస్ట్ పార్టీ BRS.. అంత డబ్బు ఎలా వచ్చింది? కేసీఆర్ ఏ కేసులో ఉన్నా.. హరీష్ అక్కడ ఉంటారు. రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి కావాలని కేసీఆర్ కుటుంబాన్ని టార్గెట్ చేసే ఆలోచన లేదంటూ సెటైరికల్ కామెంట్స్ చేశారు.

ఉద్దేశపూరితంగా చేసింది..

ఇక ఏది బయట పడినా అందులో ఆ కుటుంబం పాత్ర ఉంటుందన్నారు. ఇప్పటి వరకు వేసిన కేసులు, విచారణ కమిషన్ లు బిఆర్ఎస్ వాళ్లు అడిగితేనే వేశామన్నారు. కాళేశ్వరం, విద్యుత్, ఈ ఫార్ములాపై విచారణ వారే అడిగారు. కక్షపూరితంగా, ఉద్దేశపూరితంగా చేసింది ఏమీలేదు. సిస్టంలో వాళ్ళు తప్పులు చేశారు కాబట్టే అన్ని బయటపడుతున్నాయి. జైలుకు వెళ్తేనే సిఎం అవుతాను అనుకుంటే కేటీఆర్ కంటే ముందు కవిత ఉన్నారు. ఇవేవీ లాభనష్టాల కోసం జరుగుతున్నవి కాదు. అరవింద్ కుమార్ నిజాలు చెప్తే అన్ని బయటకు వస్తాయి. జాతీయ పార్టీలకు లేని నిధులు ప్రాంతీయ పార్టీకి ఎలా వచ్చాయి. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు దేశం గురించి తప్ప తెలంగాణ గురించి మాట్లాడలేదని గుర్తు చేశారు.

ఇది కూడా చదవండి:  Dogs: అయ్యో పాపం.. కాళ్లు,నోళ్లు కట్టేసి 32కుక్కలను చంపిన గ్రామస్థులు!

అలాగే సంక్రాంతి పండుగ తరువాత రికార్డుల ఫోరెన్సిక్ ఆడిట్ కోసం ప్రైవేట్ సంస్థలకు ఇవ్వబోతున్నామని తెలిపారు. భూదాన్, దేవాదాయ, అసైండ్ భూముల్లో జరిగిన కుంభకోణాలు అన్నీ ఫోరెన్సిక్ ఆడిట్ లో బయట పడతాయని చెప్పారు. సిరిసిల్లలో 2వేల ఎకరాల ప్రభుత్వ భూమి అన్యాక్రాంతం అయింది. రంగారెడ్డి, మెదక్, మేడ్చల్ జిల్లాల్లో జరిగిన భూ బాగోతం ఫోరెన్సిక్ ఆడిట్ తర్వాత బయట పడుతుంది. భుబారతి బిల్లు గవర్నర్ వద్ద ఉంది. గవర్నర్ నుంచి అనుమతి రాగానే గెజిట్ విడుదల అవుతుంది. రూల్స్ ప్రేమ్ చేయడానికి రెండు నెలల టైం పడుతుంది. సియోల్ బాంబులు పేలడం మొదలు అవుతున్నాయి. విద్యుత్ కమిషన్ రిపోర్ట్ వచ్చింది.. ప్రభుత్వం లీగల్ ఒపినియన్ తీసుకుంటున్నదికాళేశ్వరం కమిషన్ బహిరంగ విచారణ కొనసాగుతోంది. ఫోన్ ట్యాపింగ్ కేసు ఇంకా అవ్వలేదు.. కొనసాగుతుంది. నేను మంత్రి అయ్యాక మా జిల్లా మాజీ మంత్రి నేను ఎదురుపడలేదు. అసలు ఉన్నాడా? లేడా అన్నట్లు నడుస్తోందంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 

ఇది కూడా చదవండి:  Ajith Kumar : హీరో అజిత్ కు ఘోర రోడ్డు ప్రమాదం.. షాకింగ్ వీడియో

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు