Nallamala: నల్లమలలో భారీ భూగర్భ సొరంగం తవ్వేందుకు అధికారులు రంగం సిద్ధం చేశారు. గోదావరి- బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టులో భాగంగా నల్లమల అడవుల మీదుగా 24 వేల క్యూసెక్కుల నీళ్లు తరలించేందుకు 27 కి.మీ. పొడవున టన్నెల్ తవ్వనున్నారు. 17 వేల ఎకరాల అటవీ భూమి అవసరమని భావిస్తున్నారు. 118 కి.మీ పొడవున గ్రావిటీ కాలువ.. ఈ మేరకు బొల్లాపల్లి జలాశయంలో నీటిని నిల్వ చేసి అక్కడి నుంచి బనకచర్ల హెడ్ రెగ్యులేటర్‌కు తరలించనున్నారు. అయితే వీటిని నల్లమల ఫారెస్టు మీదుగా తీసుకెళ్లాల్సివుండగా.. అటవీశాఖ రూల్స్ ప్రకారం పర్మిషన్ పొందేందుకు అండర్ టన్నెల్ నిర్మించాలని భావిస్తున్నారు. ఇక ఈ టన్నెల్ ద్వారా 24 వేల క్యూసెక్కుల నీరు తరలించేందుకు 118 కి.మీ పొడవున గ్రావిటీ కాలువ తవ్వునున్నారు. మూడుచోట్ల నీటిని ఎత్తిపోయాల్సి ఉండటంతో టన్నెల్ నిర్మాణం తప్పనిసరి కానుంది. ఇందుకోసం 27 కి.మీ. పొడవున టన్నెల్ తవ్వేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. వన్యప్రాణి, అటవీ సంరక్షణ కోసం టన్నెల్‌ను భూగర్భంలోనుంచి తీసుకెళ్లాలని యోచిస్తున్నారు. టన్నెల్ కోసం దాదాపు 17 వేల ఎకరాల అటవీ భూమి అవసరం ఉంటుందని, బొల్లాపల్లి జలాశయంలోనే 15 వేల ఎకరాలు వినియోగించాల్సివుంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇదికూడా చదవండి: Tiger: మనసు మార్చుకున్న పులి.. మనిషిని చూస్తే జంకుతుందట! ఇక ఈ టన్నెల్ పర్మిషన్ కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సులభంగానే అనుమతిలిస్తాయని, అటవీ భూమికి ప్రత్యామ్నాయంగా భూములు చూపేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. దీనికోసం కేంద్ర జలసంఘానికి డీపీఆర్ సమర్సించనున్నారు. ఇక ప్రాజెక్టు కోసం 5వేల మెగావాట్ల కరెంట్ అవసరం కానుండగా ఇందుకు రూ.వేల కోట్లు ఖర్చయ్యే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఇదికూడా చదవండి: Maharaja : 'బాహుబలి 2' రికార్డు బ్రేక్ చేసిన విజయ్ సేతుపతి సినిమా.!