సంధ్యా థియేటర్ ఘటనలో గాయపడిన శ్రీతేజ్ హైదరాబాద్‌లో కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటన రాజకీయంగా ఇంకా చాలా రకాలుగా తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఇష్యూ అయింది. దీంతో అతని ఆరోగ్యం మీద కిమ్స్ వైద్యులు స్పెషల్ ఫోకస్ పెట్టారు. దానికి తోడు శ్రీతే ఆసుపత్రి ఖర్చులు అన్నీ అల్లు అర్జున్ భరిస్తున్నాడు. ప్రస్తుతం బాబు కోలుకోవడం అల్లు అర్జున్‌తో పాటూ మొత్తం మూవీ టీమ్‌కు ఎంతో అవసరం. అలాగే అతనిని పరామర్శించడానికి చాలామంది నేతలు, ప్రముఖులూ తరలివస్తున్నారు కూడా. వెంటిలేటర్ లేకుండానే.. ఈ క్రమంలో శ్రీతేజ్ ఆరోగ్యం మీద ఫుట్ ఎటెన్షన్ ఏర్పడింది. అందుకే కిమ్స్ వైద్యులు దీనికి సంబంధించి ఎప్పటికప్పుడు హెల్త్ బులెటిన్‌లను విడుదల చేస్తున్నారు. శ్రీతేజ్ బాగానే కోలుకున్నాడని ఈరోజు డాక్టర్లు తెలిపారు. ఎటువంటి ఆక్సిజన్ కానీ వెంటిలేటరీ సపోర్ట్ లేకుండా ఊపిరి తీసుకుంటున్నాడని తెలిపారు. అతను అప్పుడప్పుడు కళ్లు తెరుస్తున్నాడు కానీ.. ఐ కాంటాక్ట్ కానీ..కుటుంబ సభ్యులను గుర్తు పట్టడం లాంటివి కానీ చేయడం లేదని వెల్లడించారు. సైగలను గమనిస్తున్నాడు కానీ..మాటలను అర్థం చేసుకోలేకపోతున్నాడని తెలిపారు. నాసోగ్యాస్ట్రిక్ ట్యూబ్ వెల్ ద్వారా ఫుడ్ ను అందిస్తున్నామని చెప్పారు డాక్టర్లు. పుష్ప 2' ప్రీమియర్ షో చూసేందుకు హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్‌కు అల్లు అర్జున్ వెళ్లిన సంగతి తెలిసిందే. ఆయన్ను చూసేందుకు అభిమానులు పెద్ద సంఖ్యలో చేరుకోవడంతో తొక్కిసలాట జరిగింది. రేవతి అనే మహిళ మృతి చెందారు. ఆమె కుమారుడు శ్రీతేజ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. మరోవైపు తొక్కిసలాట కేసును పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో 18 మంది నిందితులను చేర్చారు పోలీసులు. ఈ కేసులో అల్లు అర్జున్ ను ఏ11 గా చేర్చిన పోలీసులు.. ఏ 18గా పుష్ఫ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీస్ నిర్మాతలను చేర్చారు. ఏ1 నుంచి ఏ8 వరకు థియేటర్ యజమానులు, మేనజర్ ను చేర్చారు. ఏ9 ,ఏ 10 గా సంధ్య థియేటర్ సెక్యూరిటీ, మేనేజర్ ను చేర్చారు. ఏ 11 నుంచి ఏ 17 వరకు అల్లు అర్జున్, బౌన్సర్, సెక్యూరిటీ పేర్లను చేర్చారు. Also Read: SBI: పొదుపు మంత్ర పాటిస్తున్న భారతీయులు..ప్రపంచంలో నాల్గవ స్థానంలో..