Pushpa-2: అల్లు అర్జున్ కు బిగ్ షాక్.. శ్రీతేజ్ కు మళ్లీ సీరియస్!

శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితి మళ్లీ సీరియస్ గా మారినట్లు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. మళ్లీ వెంటిలెటర్ సహకారంతోనే ఆక్సిజన్ అందించాల్సిన పరిస్థితి ఏర్పడినట్లు తెలుస్తోంది. దీంతో అందరిలోనూ టెన్షన్ వ్యక్తం అవుతోంది.

New Update
sriteja health condition

sriteja health condition

సంధ్య థియేటర్‌ తొక్కిసలాటలో గాయపడిన శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితి మళ్లీ విషమంగా మారింది. కొన్ని రోజులుగా ఆయన కోలుకుంటున్నట్లు వార్తలు వచ్చాయి. ఆక్సిజన్ తీసిశామని.. సొంతంగా శ్వాస తీసుకుంటున్నాడని వైద్యులు తెలిపారు. రెండు రోజులుగా మళ్లీ శ్రీతేజ్‌కు ఆక్సిజన్, వెంటిలేటర్ సపోర్ట్ అవసరం అయ్యిందని డాక్టర్లు చెబుతున్నారు. ఊపిరితిత్తుల్లో సమస్య ఏర్పడినట్లు వెల్లడిస్తున్నారు. నాసో గ్యాస్ట్రిక్ ట్యూబ్‌ ద్వారా ఫీడింగ్ ఇస్తున్నట్లు చెప్పారు. న్యూరో సిస్టమ్‌లో ఎలాంటి స్పందన లేదని వివరిస్తున్నారు. డిసెంబర్ 4న పుష్ప మూవీ విడుదల సందర్భంగా సంధ్య థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాటలో శ్రీతేజ్ తల్లి రేవతి చనిపోయిన విషయం తెలిసిందే. ఆ ఘటనలో శ్రీతేజ్ అపస్మారక స్థితిలో చేరుకున్నారు. ఈ ఘటన దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది.
ఇది కూడా చదవండి:  అనిల్‌ రావిపూడి నుంచి అదిరిపోయే కాంబో..ఎవరితోనో తెలుసా!

సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రకటన చేశారు. అల్లు అర్జున్ నిర్లక్ష్యం కారణంగానే ఘటన జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టి తాను ఎలాంటి తప్పూ చేయలేదన్నారు. ఆ మరుసటి రోజు పోలీసులు ప్రెస్ మీట్ పెట్టి ఘటన రోజు వీడియోలను ప్రదర్శించారు. వారు కూడా అల్లు అర్జు్న్ కారణంగానే తొక్కిసలాట జరిగిందన్న విషయాన్ని స్పష్టం చేశార. ఆ తర్వాత అల్లు అర్జున్ ను విచారణకు పిలిచారు. 
ఇది కూడా చదవండి:మోదీ వ్యాఖ్యలపై రియాక్ట్ అయిన చైతూ - శోభిత.. ఏమన్నారంటే?

Also Read:'సలార్' కు ఫస్ట్ నన్నే అడిగారు.. కానీ? స్టార్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్

పుష్ప టీం భారీ సాయం..

సోషల్ మీడియాలో ఈ అంశంపై అల్లు అర్జున్, పుష్ప టీంపై తీవ్ర విమర్శలు వచ్చాయి.దీంతో అల్లు అర్జున్ రూ.1 కోటి, దర్శకుడు సుకుమార్ రూ.50 లక్షలు, నిర్మాతలు మరో రూ.50 లక్షలు శ్రీతేజ్ కుటుంబానికి సాయం అందించారు. వివాదం టాలీవుడ్ వర్సెస్ తెలంగాణ ప్రభుత్వంగా మారుతుండడంతో ఫిల్మ్ డవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు రంగంలోకి దిగారు. సీఎం రేవంత్ రెడ్డితో సినీ పెద్దల సమావేశం ఏర్పాటు చేశారు. మరోవైపు శ్రీతేజ్ కూడా కోలుకుంటున్నట్లు వార్తలు వచ్చాయి. దీంతో వివాదానికి ఎండ్ కార్డు పడే అవకాశం ఉందన్న చర్చ మొదలైంది. అల్లు అర్జున్ కూడా ఫైనల్ ప్రమోషన్స్ పై ఫోకస్ పెట్టారన్న వార్తలు వచ్చాయి. అయితే.. శ్రీతేజ్ హెల్త్‌ కండిషన్ సీరియస్ గా మారడంతో అందరిలో టెన్షన్ మొదలైంది.  

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు