Allu Arjun : జపాన్ లో అల్లు అర్జున్ సంచలనం.. ధూమ్ 3 రికార్డును బ్రేక్ చేసిన పుష్పరాజ్!
రెండు వారాల్లోనే పుష్ప 2: ది రూల్ సరికొత్త రికార్డులను సృష్టించి, జపాన్‌లో అత్యధిక వసూళ్లు రాబట్టిన టాప్ 10 భారతీయ సినిమాల జాబితాలోకి అధికారికంగా ప్రవేశించింది.
రెండు వారాల్లోనే పుష్ప 2: ది రూల్ సరికొత్త రికార్డులను సృష్టించి, జపాన్‌లో అత్యధిక వసూళ్లు రాబట్టిన టాప్ 10 భారతీయ సినిమాల జాబితాలోకి అధికారికంగా ప్రవేశించింది.
సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో పోలీసులు ఛార్జిషీట్ దాఖలు చేశారు. మొత్తం 23 మందిపై అభియోగాలు మోపుతూ దాఖలు చేసిన ఛార్జిషీట్లో ఏ-11గా సినీ నటుడు అల్లు అర్జున్ పేరు చేర్చడం గమనార్హం.
ఏసీపీ సబ్బతి విష్ణుమూర్తి గుండెపోటుతో కన్నుమూశారు. హైదరాబాద్‌లోని తన నివాసంలో ఆదివారం రాత్రి ఆయన తుది శ్వాస విడిచారు. 'పుష్ప 2' ఘటనపై అల్లు అర్జున్‌కు ఘాటుగా వార్నింగ్ ఇవ్వడంతో ఆయన తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించారు.
జూబ్లీహిల్స్ రోడ్ నం. 45లోని అల్లు బిజినెస్ పార్కు నిర్మాణానికి సంబంధించి జీహెచ్ఎంసీ అధికారులు అల్లు అరవింద్‌కు నోటీసులు జారీ చేశారు. అనుమతి ఉన్న దానికంటే అదనంగా పెంట్‌హౌస్ నిర్మించారని, ఎందుకు కూల్చకూడదో వివరణ ఇవ్వాలని నోటీసులో పేర్కొన్నారు.
జానీ మాస్టర్ మాజీ అసిస్టెంట్ శ్రష్ఠి వర్మ బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లోకి ఎంట్రీ ఇచ్చారు. ఢీ డ్యాన్స్ షో ద్వారా పాపులర్ చెందిన ఈమె గతేడాది విడుదలైన పుష్ప 2లో కొన్ని సాంగ్స్‌కు కూడా ఈమె కొరియోగ్రఫీ చేసింది. ఈమె జానీ మాస్టర్ అసిస్టెంట్‌గా కూడా వర్క్ చేసింది.
దుబాయ్ లో సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్..సైమా పండుగ అత్యంత వైభవంగా జరుగుతోంది. మొదటి రోజు తెలుగు, కన్నడ సినీఅవార్డులను ప్రదానం చేశారు. ఈ 13వ సైమా వేడుకల్లో తెలుగులో పుష్ప2 , కల్కి సినిమాలు ఎక్కువ అవార్డులను సొంతం చేసుకున్నాయి.
గామా అవార్డ్స్ 2025 ఆగస్టు 30న దుబాయ్‌లోని షార్జా ఎక్స్పో సెంటర్లో జరిగాయి. 'పుష్ప 2' ఉత్తమ చిత్రంగా, అల్లు అర్జున్ ఉత్తమ నటుడిగా, మీనాక్షి చౌదరి ఉత్తమ నటిగా అవార్డులు గెలుచుకున్నారు. సుకుమార్ ఉత్తమ దర్శకుడిగా నిలిచారు.
బీహార్ లో కొంతమంది కుర్రాళ్ళ అల్లు అర్జున్ తరహాలో 'తగ్గేదేలే' అంటూరోడ్లపైన రెచ్చిపోయారు. 'పుష్ప' సినిమాలోని 'తగ్గేదేలే' డైలాగ్ ని అనుసరిస్తూ రోడ్డుపై రీల్ వీడియో చేశారు.
అల్లు అర్జున్ 'పుష్ప2' బుల్లితెరపై సరికొత్త రికార్డు సృష్టించింది. ఇటీవలే జీ సినిమాలో ప్రసారమైన ఈ చిత్రం 5.1 టీఆర్ఫీ రేటింగ్ నమోదు చేసింది. దాదాపు 5.4 కోట్ల మంది టెలివిజన్ పై ఈ చిత్రాన్ని వీక్షించారు. ఈ విషయాన్ని మేకర్స్ ఎక్స్ వేదికగా ప్రకటించారు.