Devi Sri Prasad: మైత్రి vs డీఎస్పీ: 'పుష్ప 2' సెగలు 'ఉస్తాద్' వరకు.. రగిలిపోతున్న ఫ్యాన్స్!

దేవిశ్రీ ప్రసాద్, మైత్రీ మూవీ మేకర్స్ మధ్య గత కొంత కాలంగా విభేదాలు సాగుతున్నట్లు వార్తలు చక్కర్లు కొట్టిన విషయం తెలిసిందే. 'పుష్ప 2-' మూవీ సమయంలో మొదలైన ఈ వివాదం.. ఇప్పుడు 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమాతో మరోసారి తెరపైకి రావడం సంచలనంగా మారింది.

New Update
devi sri prasad and mythri movie makers controversy

devi sri prasad and mythri movie makers controversy

టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్, చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ మధ్య గత కొంత కాలంగా విభేదాలు సాగుతున్నట్లు వార్తలు చక్కర్లు కొట్టిన విషయం తెలిసిందే. తాజాగా మరోసారి వీరి మధ్య విభేదాలు చర్చనీయాంశమయ్యాయి. 'పుష్ప 2' మూవీ సమయంలో మొదలైన ఈ వివాదం.. ఇప్పుడు 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమాతో మరోసారి తెరపైకి రావడం సంచలనంగా మారింది. అయితే వీరి మధ్య వివాదం ఏంటి?.. వివాదానికి గల కారణాలేంటి? అనేది తెలుసుకుందాం. 

వివాదానికి అసలు కారణం?

పవర్ స్టార్ పవన్ కల్యాణ్, హరీష్ శంకర్ దర్శకత్వంలో 'ఉస్తాద్ భగత్ సింగ్' మూవీ రూపొందింది. ఇది ఎన్నో ఏళ్ల నిరీక్షణ తర్వాత ఈ నెల (మార్చి) 19న గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానుంది. అయితే ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ డైరెక్టర్ గా ముందుగా ప్రకటించారు. కానీ ఆయన ఈ చిత్రంలో కేవలం పాటలకు మాత్రమే పరిమితమయ్యారు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ (బీజీఎం) బాధ్యతల్ని నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ మరో మ్యూజిక్ డైరెక్టర్ ఎస్.ఎస్. థమన్ కు అప్పగించింది. 

అయితే అందుకూ ఓ కారణం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రం విడుదల తేదీని ఒక వారం ముందుకు జరపాలని (మార్చి19కి) నిర్మాతలు నిర్ణయించడమే దీనికి ముఖ్య కారణం అని తెలుస్తోంది. దీంతో దేవిశ్రీ తన బిజీ షెడ్యూల్ కారణంగా ఆ సమయంలోగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కంప్లీట్ చేయలేనని చెప్పినట్లు సమాచారం. అందువల్ల ఇరుపక్షాల మధ్య చర్చలు జరిగి.. చివరి నిమిషంలో మరో మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ను తీసుకున్నట్లు సినీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. 

'పుష్ప 2'తో మొదలైన వివాదం

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన 'పుష్ప' మూవీ ఎంతటి బ్లాక్ బస్టర్ హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే. దాని తర్వాత 'పుష్ప2' కూడా వరల్డ్ వైడ్ గా దుమ్ములేపేసింది. ఈ చిత్రానికి మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణ సంస్థ.. కాగా మ్యూజిక్ డైరెక్టర్ గా దేవీశ్రీ ప్రసాద్ ఉన్నారు. అయితే ఈ సీక్వెల్ సమయంలోనే దేవిశ్రీ ప్రసాద్ పని తీరు పట్ల మైత్రీ సంస్థ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. దీంతో థమన్ అండ్ సామ్ సీఎస్ లను రంగంలోకి దించడంతో వారిద్దరూ కలిసి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించారు. 

డీఎస్పీ ఫ్యాన్స్ ఫైర్

ఇలా వరుసగా మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ దేవీశ్రీని సినిమాల బ్యాక్ గ్రౌండ్ స్కోర్ నుంచి తప్పించడంపై డీఎస్పీ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. సోషల్ మీడియా వేదికగా ట్వీట్లు చేస్తూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ను పదే పదే అవమానించడం సరికాదని అంటున్నారు. ఒక నేషనల్ అవార్డు విన్నర్ ను సైడ్ చేయడం వెనుక ఏదో పెద్ద కారణాలే ఉన్నాయని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.  

Advertisment
తాజా కథనాలు