ఆంధ్రప్రదేశ్ CM Chandrababu: ఇలా ఎవడైనా చేస్తాడా?: అధికారులపై చంద్రబాబు ఫుల్ సీరియస్! ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తిరుమలకు చేరుకున్నారు. టీటీడీ ఈవో, కలెక్టర్, అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పద్దతి ప్రకారం పని చేయడం నేర్చుకోవాలని అధికారులకు క్లాస్ పీకారు. 2వేల మందే పడతారని తెలిసినా 2500 మందిని ఎందుకు పంపించారని మండిపడ్డారు. By Seetha Ram 09 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తిరుపతి Tirupati Stampede: 'భక్తులు చనిపోయింది తొక్కిసలాటతో కాదు' కాంగ్రెస్ నాయకుడు చింతా మోహన్ గాయపడిన భక్తులను కలిశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తిరుపతిలో భక్తులు తొక్కిసలాటతో చనిపోలేదని తెలిపారు. రక్తంలో చక్కెర తక్కువగా ఉండటం వల్ల భక్తులు కుప్పకూలిపోయారని చింతా మోహన్ అన్నారు. By Kusuma 09 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Tirupati Stampede: చంద్రబాబు లెగ్ మహత్యం.. తిరుపతి ఘటనపై రోజా ధ్వజం! తిరుపతిలో తొక్కిసలాట ఘటనకు చంద్రబాబు ప్రభుత్వమే బాధ్యత వహించాలని మాజీ మంత్రి రోజా అన్నారు. ప్రభుత్వం, TTD ఫెయిల్ అయ్యాయన్నారు. సనాతన ధర్మాన్ని రక్షిస్తానన్న పవన్ ఎక్కడా అని ప్రశ్నించారు. తిరుమల చరిత్రలోనే ఎప్పుడూ జరగని ఘోరం ఇదని ఆవేదన వ్యక్తం చేశారు. By Nikhil 09 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Tirupati Stampede: తొక్కిసలాట ఘటనపై రెండు కేసులు నమోదు! తిరుపతి తొక్కిసలాట ఘటనపై రెండు కేసులు నమోదయ్యాయి. బైరాగిపట్టెడ పద్మావతి పార్క్ లో తొక్కిసలాట జరిగిన ఘటనకు సంబంధించి నారాయణపురం ఎంఆర్ఓ ఈస్ట్ పీఎస్ లో ఫిర్యాదు చేశారు. విష్ణు నివాసంలో జరిగిన తొక్కిసలాట ఘటనపై బాలయ్యపల్లె ఎంఆర్ఓ ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు. By Nikhil 09 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Tirupati Stampede: తిరుపతి మృతులకు పరిహారం ప్రకటన తిరుపతి తొక్కిసలాట ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ప్రభుత్వం పరిహారం ప్రకటించింది. ఒక్కో కుటంబానికి రూ.25 లక్షల చొప్పున అందించనున్నట్లు మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. తిరుపతి రియా ఆస్పత్రిలో మృతుల కుటుంబాలను మంత్రులు పరామర్శించారు. By Nikhil 09 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Tirupati Stampede పై రేవంత్ రెడ్డి, బండి సంజయ్ దిగ్భ్రాంతి! తిరుపతి తొక్కిసలాటపై ప్రధాన మోదీతో సహా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, బండి సంజయ్ పలువురు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మరణించిన వారికి తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్ధించారు. By Bhavana 09 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn