తిరుపతిలో టోకెన్ల కోసం భక్తుల మధ్య తొక్కిసలాట జరగడంతో ఆరుగురు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ తొక్కిసలాట ఘటనపై ఇప్పటికే పలువురు స్పందించారు. తాజాగా కాంగ్రెస్ నాయకుడు చింతా మోహన్ గాయపడిన వారిని కలిశారు. ఈ ఘటనకు సంబంధించి మాట్లాడుతూ.. టీటీడీ దీనికి బాధ్యత వహించలేదని తెలిపారు. ఇది కూడా చూడండి: Daaku Maharaaj: బాలయ్యకు బిగ్ షాక్.. డాకూ మహారాజ్ ప్రీ రిలీజ్ క్యాన్సిల్! #TirupatiStampede | Congress leader Chinta Mohan meets the injured at SVIMS, asserts #TTD was not responsible for incident. Adds that the #devotees had collapsed due to low blood sugar as they joined the queue soon after reaching #Tirupati without having food@NewIndianXpress pic.twitter.com/A6h9pgs8vz — TNIE Andhra Pradesh (@xpressandhra) January 9, 2025 ఇది కూడా చూడండి: Tirupati: అంతా రెప్పపాటులో జరిగిపోయింది..తిరుపతి ఘటన టైమ్ టు టైమ్ సీన్ రక్తంలో చక్కెర తక్కువగా ఉండటం వల్ల.. తిరుపతికి చాలా దూరం నుంచి వస్తుంటారు. ఈ సమయంలో సరైన ఆహారం ఉండదు. టోకెన్ల కోసం వెంటనే క్యూ లైన్లలో చేరారు. ఫుడ్ లేకపోతే రక్తలో చక్కెర తక్కువగా ఉండటం వల్ల భక్తులు కుప్పకూలిపోయారని, తొక్కిసలాటతో చనిపోలేదని చింతా మోహన్ అన్నారు. ఇది కూడా చూడండి: TTD: ప్రభుత్వ వైఫల్యమే తొక్కిసలాటకు దారితీసింది: భూమన కరుణాకర్‌రెడ్డి వైకుంఠ ద్వార సర్వ దర్శనానికి టీటీడీ టోకెన్లు జారీ సమయంలో తొక్కిసలాట (Tirupati Stampede) జరిగింది. విష్ణు నివాసం వద్దకు పెద్ద ఎత్తున భక్తులు రావడంతో తోపులాట జరిగింది. ఈ ఘటనలో మొత్తం ఆరుగురు భక్తులు మృతి చెందారు. పలువురికి తీవ్ర గాయాలు అయ్యాయి. టీటీడీ సరైన ఏర్పాట్లు చేయకపోవడం, టికెట్ల జారీ సమయాన్ని మార్చడం వల్ల ఇలా జరిగిందని అంటున్నారు. ఇది కూడా చూడండి: Tirupati Stampede: తొక్కిసలాటకు కారణం అదే.. వెలుగులోకి షాకింగ్ నిజాలు!