తిరుపతిలో తొక్కిసలాట ఘటనకు చంద్రబాబు ప్రభుత్వమే వహించాలని మాజీ మంత్రి రోజా స్పష్టం చేశారు. ప్రభుత్వం, టీటీడీ ఫెయిల్ అయ్యాయన్నారు. సనాతన ధర్మాన్ని రక్షిస్తానన్న పవన్ ఎక్కడా అని ప్రశ్నించారు. తిరుమల చరిత్రలోనే ఎప్పుడూ జరగని ఘోరం ఇదని ఆవేదన వ్యక్తం చేశారు. సంధ్య థియేటర్ ఘటనలో నేరుగా అల్లు అర్జున్ ప్రమేయం లేకున్నా.. ఆయనపై బీఎన్ఎస్ 105 సెక్షన్ కింద కేసు పెట్టారన్నారు. మరి.. తిరుపతి తొక్కిసలాట ఘటనకు సీఎం చంద్రబాబు, టీటీడీ, కింది స్థాయి అధికారులు బాధ్యతలు వహించాలి కదా? అని ప్రశ్నించారు.