Manmohan Singh: ప్రముఖులతో మన్మోహన్ సింగ్ అరుదైన చిత్రాలు
రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన మన్మోహన్ సింగ్ అజాత శత్రువు అనిపించుకున్నారు. ప్రతిపక్ష నేతలు సైతం ఆయనను కొనియాడేవారు. మాటలతో కా చేతలతో పని చేసి చూపించిన ఏకైక ప్రధాని మన్మోహన్ సింగ్.
రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన మన్మోహన్ సింగ్ అజాత శత్రువు అనిపించుకున్నారు. ప్రతిపక్ష నేతలు సైతం ఆయనను కొనియాడేవారు. మాటలతో కా చేతలతో పని చేసి చూపించిన ఏకైక ప్రధాని మన్మోహన్ సింగ్.
అంబేద్కర్ను అమిత్షా అవమానించారని పార్టీకి రాజీనామా చేయాలని కాంగ్రెస్ పార్టీ నిరసనలు చేపట్టింది. అదే విధంగా కాంగ్రెస్ పార్టే అంబేద్కర్ను అవమానించిందని అధికార పార్టీ నిరసనలు చేపట్టింది. దీంతో పార్లమెంట్ ప్రాంగణంలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది.
కేంద్ర ప్రభుత్వం ‘బీమా సఖి’ స్కీమ్ ప్రారంభించింది. దీని ద్వారా 10 పాసైన మహిళలు LIC ఏజెంట్లుగా పనిచేస్తారు. బీమా సంబంధిత పనులు నిర్వహిస్తారు. వీరు ప్రతి నెలా రూ. 7,000 నుంచి రూ. 21,000 వరకు అందుకుంటారు. వీరి వయస్సు 18 నుంచి 50 సంవత్సరాల మధ్య ఉండాలి.
AP: తమకు 25 మంది ఎంపీలను ఇస్తే రాష్ట్రానికి ప్రత్యేక హోదా చేస్తానని చెప్పి జగన్ ప్రజలకు తీరని అన్యాయం చేశారని షర్మిల ఫైరయ్యారు. విభజన హామీలు బుట్టదాఖలు చేయడంలో ప్రధాన ముద్దాయి మోదీ, రెండో ముద్దాయి చంద్రబాబు, మూడో ముద్దాయి జగన్ అని విమర్శించారు.
అదానీ అవినీతి కేసుపై మోదీ, చంద్రబాబు మౌనం వీడాలని ఏపీసీసీ షర్మిల అన్నారు. అదానీ-జగన్ రూ.1750 కోట్ల ముడుపులపై ఏసీబీ దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు. సీబీఐ చేతకానిదా? మోదీ చేతకాని వాడా? అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణ బీజేపీ నేతలతో పీఎం మోదీ ఈ రోజు భేటీ అయ్యారు. సీఎం రేవంత్ పాలన ఎలా ఉంది? కేంద్ర పథకాలు ఎలా అమలు అవుతున్నాయి?.. తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. కలిసికట్టుగా పని చేయాలని.. రాష్ట్రంలో భవిష్యత్ బీజేపీదేనని దిశానిర్దేశం చేశారు.
మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే సంచలన ప్రకటన చేశారు. తనకు ప్రధాని మోదీ, అమిత్ షా సపోర్ట్ ఉందన్నారు. అయితే సీఎం పదవిని ప్రధాని మోదీకి వదిలేశానని చెప్పారు. బీజేపీ హైకమాండ్ ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉన్నానని స్పష్టం చేశారు.
మహారాష్ట్రలో భారీ విజయం తర్వాత ప్రధాని మోదీ తెలంగాణపై ఫోకస్ పెట్టారు. ఇందులో భాగంగా నేడు తెలంగాణ ఎంపీలు, ఎమ్మెల్యేలతో ఆయన సమావేశం కానున్నారు. పార్టీ బలోపేతానికి అనుసరించాల్సిన వ్యూహాలు, కొత్త బీజేపీ చీఫ్ పై చర్చించే అవకాశం ఉందని తెలుస్తోంది.