Ind vs Eng: మొదటి వన్డే మ్యాచ్ మనదే.. అదరగొట్టిన గిల్, శ్రేయస్!

ఇంగ్లాండ్‌తో జరిగిన మొదటి వన్డే లో భారత్ విజయం సాధించింది. నాగ్‌పుర్‌ మ్యాచ్ లో 4 వికెట్ల తేడాతో గెలిచింది. ఇంగ్లాండ్ విధించిన 249 పరుగుల లక్ష్యాన్ని 38.4 ఓవర్లలో ఛేదించింది. గిల్‌ (87), శ్రేయస్‌ (59), అక్షర్‌ పటేల్‌ (52) అర్ధశతకాలతో రాణించారు. 

New Update
ind vs eng

Ind vs Eng: India won the first ODI

Ind vs Eng: ఇంగ్లాండ్‌తో జరిగిన మొదటి వన్డే మ్యాచ్‌లో భారత్ విజయం సాధించింది. నాగ్‌పుర్‌ వేదికగా జరిగిన వన్డేలో 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఇంగ్లాండ్ విధించిన 249 పరుగుల లక్ష్యాన్ని 38.4 ఓవర్లలో ఛేదించింది. గిల్‌ (87), శ్రేయస్‌ (59), అక్షర్‌ పటేల్‌ (52) అర్ధశతకాలతో రాణించారు. 

Also Read: Mastan Sai : డ్రగ్స్ ఇస్తాడు.. న్యూడ్ వీడియోలు తీస్తాడు..  మస్తాన్ మాములోడు కాదయ్యా!

అరంగేట్రలోనే అదరగొట్టిన హర్షిత్‌ రాణా..

ఈ మేరకు మూడు వన్డేల సిరిస్‌లో భాగంగా నాగ్‌పుర్‌ వేదికగా జరిగిన మ్యాచ్ లో భారత్‌ నుంచి యశస్వి జైస్వాల్, హర్షిత్ రాణా వన్డేల్లోకి అరంగేట్రం చేశారు.  భారత్ టాస్ ఓడి బౌలింగ్ చేసింది. ఇంగ్లాండ్ జట్టు 47.4 ఓవర్లలో 248 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్‌ ఫిలిప్‌ సాల్ట్‌ (43; 26 బంతుల్లో 5×4; 3×6) , కెప్టెన్‌ బట్లర్‌ (52; 67 బంతుల్లో 4×4), బెతెల్‌ (51; 64 బంతుల్లో 3×4, 1×6 ) పర్వాలేదనింపించారు. భారత్ బౌలర్లలో హర్షిత్‌ రాణా తొలి మ్యాచ్‌లోనే కీలకమైన 3 వికెట్లు పడగొట్టాడు. జడేజా 3, అక్షర్‌ పటేల్‌, మహ్మద్‌ షమీ, కుల్‌దీప్‌ యాదవ్‌ ఒక్కో వికెట్ తీశారు.

గిల్, శ్రేయస్ భారీ ఇన్నింగ్స్..

భారత బ్యాటర్లలో వైస్‌ కెప్టెన్‌ శుభ్‌మన్‌ గిల్‌ (87; 96 బంతుల్లో 14×4) రాణించాడు. అక్షర్‌ పటేల్‌ (52; 47 బంతుల్లో 6×4, 1×6),  శ్రేయస్‌ అయ్యర్‌ (59; 36 బంతుల్లో 9×4, 2×6) అర్ధశతకాలతో అదరగొట్టారు. ఓపెనర్లు జైస్వాల్‌ (15), రోహిత్‌ శర్మ (2) నిరాశ పరిచారు. ఇంగ్లండ్‌ బౌలర్లలో ఆర్చర్‌ 2, మహమూద్‌ 2, బెతెల్‌, రషీద్‌ తలో వికెట్‌ పడగొట్టారు. 

ఇది కూడా చదవండి: Mamatha: కరీంనగర్ మమత కేసు ఛేదించిన పోలీసులు.. ప్రియుడి కుటుంబమే!

ఇక యశస్వి జైస్వాల్, హర్షిత్ రాణా అరంగేట్రం మ్యాచ్ లోనే ఔరా అనిపించారు. బౌలింగ్‌లో హర్షిత్ తనదైన స్టైల్‌లో వికెట్లు తీస్తే ఫీల్డింగ్‌లో జైస్వాల్ అదరగొట్టాడు. హర్షిత్ (9.3వ ఓవర్) వేసిన బంతిని భారీ షాట్‌ కొట్టేందుకు డకెట్ ప్రయత్నించగా యశస్వి జైస్వాల్ అద్భుతమైన క్యాచ్‌ పట్టాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. 

Also Read: Sekhar Basha: శేఖర్ బాషాకు బిగ్ షాక్.. మరో కేసు నమోదు..

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు