/rtv/media/media_files/2025/02/07/RdCri8aqnxV3DlbGKYqY.jpg)
Gongadi Trisha Photograph: (Gongadi Trisha)
Gongadi Trisha: తెలంగాణ ముద్దు బిడ్డ గొంగడి త్రిష ఐసీసీ అవార్డు రేసులో నిలిచింది. ఇటీవల మహిళల అండర్-19 టీ20 ప్రపంచ కప్‍లో అల్‌రౌండర్‌గా అదరగొట్టింది. అద్భుతమైన ప్రదర్శన కనబరచడంతో పాటు భారత్ టైటిల్ గెలవడంలో త్రిష కీలకపాత్ర పోషించింది. ప్రపంచకప్‍లో రాణించిన త్రిష తాజాగా ఐసీసీ అవార్డుకి నామినేట్ అయ్యింది. ఐసీసీ మహిళల ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డుకు జనవరి నెలలో త్రిష నామినేట్ అయ్యింది. అయితే ఈమెతో పాటు మరో ఇద్దరు కూడా ఈ రేసులో ఉన్నారు.
ఇది కూడా చూడండి: అంతా సర్వనాశనం అయిపోయింది..అక్రమవలదారులుగా వచ్చిన భారతీయుల ఆవేదన
🚨 JUST IN: The star of #U19WorldCup, G Trisha, has been nominated for the ICC Player of the Month award for January!
— Women’s CricZone (@WomensCricZone) February 6, 2025
The 19-year-old smashed the first-ever century in the history of U19 Women’s T20 World Cup. pic.twitter.com/mMwcgj6zjg
ఇది కూడా చూడండి: Delhi BJP : ఢిల్లీలో బీజేపీ గెలిస్తే సీఎం అయ్యేది ఎవరు?... లిస్టులో ఉన్నది వీళ్లే!
జట్టును గెలిపించడంలో..
గొంగడి త్రిష తెలంగాణలోని భద్రాచలం జిల్లాకి చెందినది. మహిళల అండర్-19 ప్రపంచకప్‍లో త్రిష మొదటి నుంచే రాణించింది. ప్రపంచకప్‍లో 7 మ్యాచ్‍ల్లో 309 రన్స్ చేయడంతో పాటు స్కాట్లాండ్‍తో జరిగిన మ్యాచ్‍లో సెంచరీ సాధించింది. అలాగే మహిళల అండర్-19 ప్రపంచకప్‍లో సెంచరీ చేసిన మొదటి బ్యాటర్‌గా త్రిష చరిత్ర సృష్టించింది. ఫైనల్‌లో టీమిండియాతో దక్షిణాఫ్రికా తలపడింది. ఈ మ్యాచ్‌లో త్రిష 44 పరుగులతో నాటౌట్‍గా నిలిచి జట్టును గెలిపించడంలో ముఖ్య పాత్ర పోషించింది.
ఇది కూడా చూడండి: America Eggs: అమెరికాలో కోడిగుడ్ల కొరత.. ఏకంగా రూ.35 లక్షల విలువ గల గుడ్లు దొంగతనం!
ఇదే మ్యాచ్‍లో మూడు వికెట్లను కూడా పడగొట్టింది. మొత్తం మీద ఈ టోర్నీలో ఏడు వికెట్లు సొంతం చేసుకుంది. దీంతో ఆమెకే ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డు కూడా దక్కింది. ఈ క్రమంలోనే మహిళల విభాగంలో ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డుకు ఐసీసీ గొంగడి త్రిషను నామినేట్ చేసింది. ఈమెతో పాటు ఆస్ట్రేలియా సీనియర్ స్టార్ బ్యాటర్ బెత్ మూనీ, వెస్టిండీస్ ప్లేయర్ కరిష్మా రామ్‍హరక్ కూడా ఈ అవార్డు రేసులో ఉన్నారు.