Gongadi Trisha: తెలంగాణ బిడ్డ గొంగడి త్రిషకు రూ.కోటి నజరానా.. ప్రకటించిన సీఎం రేవంత్
తెలంగాణ బిడ్డ, భారత మహిళా క్రికెటర్ గొంగడి త్రిషను తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి అభినందించారు. ఐసీసీ U19 టీ20 వరల్డ్ కప్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన త్రిషకు రూ.కోటి నజరానా ప్రకటించారు. అలాగే మరో ప్లేయర్ ధృతి కేసరికి రూ. 10 లక్షల నజరానా ప్రకటించారు.