Champions Trophy: ఫైనల్ మ్యాచ్‌లో కివీస్‌కు బిగ్ షాక్.. కీలక్ ప్లేయర్ ఔట్?

ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌లో భారత్, కివీస్ జట్టు తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో కివీస్‌కి బిగ్ షాక్ తగలనుంది. స్టార్ పేస‌ర్ మాట్ హెన్రీ రెండో సెమీస్‌లో క్యాచ్ పట్టుకునే సమయంలో భుజానికి గాయం తగిలింది. ఫైనల్‌కి గాయం తగ్గకపోతే టోర్నీ నుంచి ఔట్ అయ్యినట్లే.

New Update
Matt Henry

Matt Henry Photograph: (Matt Henry)

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 చివరకు చేరుకుంది. దుబాయ్ వేదికగా మార్చి 9న జరగనున్న ఫైనల్‌లో భారత్, న్యూజిలాండ్ తలపడనున్నాయి. మొదటి సెమీస్‌లో ఆసీస్‌ను భారత్, రెండో సెమీస్‌లో సౌతాఫ్రికాను న్యూజిలాండ్ చిత్తుచిత్తుగా ఓడించి ఫైనల్‌కి చేరాయి. అయితే ఫైనల్ మ్యాచ్‌లో కివీస్‌కు బిగ్ షాక్ తగిలే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కివీస్ జ‌ట్టు స్టార్ పేస‌ర్ మాట్ హెన్రీ(Matt Henry) గాయం బారిన ప‌డ్డాడు.

ఇది కూడా చూడండి: Mahesh Babu: SSMB29 కోసం రాష్ట్రం దాటిన మహేశ్.. ఉత్కంఠభరితమైన సన్నివేశాలపై షూట్!

ఇది కూడా చూడండి: Agent OTT Date: హమ్మయ్య.. రెండేళ్ల తర్వాత OTTలోకి అయ్యగారి సినిమా.. అక్కినేని ఫ్యాన్స్ సంబరాలు!

హెన్రీ గాయం తగ్గకపోతే..

లాహోర్ వేదిక‌గా ద‌క్షిణాఫ్రికాతో జ‌రిగిన రెండో సెమీస్‌లో క్లాసెన్ క్యాచ్‌ను పట్టుకునే క్రమంలో హెన్రీ భుజానికి గాయమైంది. అధికంగా నొప్పి రావడంతో వెంటనే మైదానం నుంచి వెళ్లిపోయాడు. కొంత సమయం తర్వాత మళ్లీ మైదానంలోకి వచ్చి రెండు ఓవర్లు బౌలింగ్ వేశాడు. హెన్రీ ఈ మ్యాచ్‌లో రెండు కీలక వికెట్లు తీశాడు. ఫైనల్ మ్యాచ్‌కి హెన్రీ గాయం తగ్గకపోతే కివీస్‌కు గట్టి ఎదురుదెబ్బే. అయితే ఫైనల్ మ్యాచ్‌కి కాస్త సమయం ఉంది. ఇంతలో నయం అవుతుందని కివీస్ జట్టు భావిస్తోంది. 

ఇది కూడా చూడండి: Railway Jobs: రైల్వేలో మరో 835 పోస్టులు.. త్వరగా దరఖాస్తు చేసుకోండి!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు