Mamata Banerjee : 74 మంది ఎమ్మెల్యేలకు దీదీ షాక్
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల వేళ తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) చీఫ్, సీఎం మమతా బెనర్జీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. 294 నియోజకవర్గాలకు గాను 291 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు.
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల వేళ తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) చీఫ్, సీఎం మమతా బెనర్జీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. 294 నియోజకవర్గాలకు గాను 291 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు.
ఢిల్లీలో రీల్స్ పిచ్చితో చేసిన ఓవరాక్షన్ ఓ యువకుడి ప్రాణాలు తీసింది. తుపాకీతో స్టంట్ చేయబోయిన ఓ యువకుడు అక్కడి కక్కడే మృతి చెందాడు. లోడ్ చేసిన గన్‌తో రీల్ చేస్తుండగా.. అది పేలిపోవడంతో ఆ యువకుడు అక్కడికక్కడే కుప్పకూలి ప్రాణాలు విడిచాడు.
కశ్మీర్ మంచు తుఫాను బీభత్సం సృష్టిస్తోంది. గత రెండ్రోజులుగా మంచు తుఫానుతో పాటు వర్షం కూడా కురుస్తోంది. దీంతో జమ్మూ కశ్మీర్ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జన జీవనం స్తంభించిపోయింది. మార్చి 20 దాకా ఇలాంటి వాతావరణమే ఉంటుందని IMD ప్రకటించింది.
కోల్‌కతాలోని ఇటీవల ఓ పాఠశాలలో నిర్వహించిన ఈవెంట్లో ఇద్దరు మైనర్ అమ్మాయిలు టవల్‌తో స్టేజీ మీద డ్యాన్స్ చేయడం దుమారం రేపిన సంగతి తెలిసిందే. దీనిపై తాజాగా జాతీయ మానవ హక్కుల చట్టం కమిషన్ (NHRC) స్పందించింది. స్కూల్ యాజమాన్యానికి నోటీసులు జారీ చేసింది.
అన్నాడీఎంకే ఎంపీ షణ్ముగన్ సీఎం స్టాలిన్‌పై విమర్శలు చేస్తూ నోరు జారారు. నాకు నయనతార కావాలి.. నా కల నెరవేరుస్తారా '' అంటూ ప్రశ్నించారు. హీరోయిన్‌పై ఆయన చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.
పశ్చిమాసియాలో యుద్ధ జ్వాలలు రోజురోజుకు ముదురుతున్నాయి. తాజాగా మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇరాన్ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ చీఫ్ అలీ లారిజానీని ఇజ్రాయెల్ దళాలు హతమార్చాయి.
పశ్చిమ బెంగాల్లో సోమవారం బీజేపీ.. 144 మంది అభ్యర్థులు జాబితాను ప్రకటించిన సంగతి తెలిసిందే. మంగళవారం టీఎంసీ పార్టీ అభ్యర్థుల పూర్తి జాబితాను విడుదల చేసింది. 294 స్థానాలకు 291 స్థానాల్లో టీఎంసీ అభ్యర్థులు బరిలోగి దిగనున్నారు.
ఒడిశాలోని కాంగ్రెస్ పార్టీలో కీలక పరిణామం చోటుచేసుకుంది. బీజేపీ బలపరిచిన స్వతంత్ర అభ్యర్థికి రాజ్యసభలో ఓటు వేసిన ముగ్గురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను పార్టీ సస్పెండ్ చేసింది.