/rtv/media/media_files/2026/03/18/mamata-2026-03-18-07-21-07.jpg)
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నిక(West Bengal Assembly elections) ల వేళ తృణమూల్ కాంగ్రెస్(trinamool-congress) (టీఎంసీ) చీఫ్, సీఎం మమతా బెనర్జీ(Mamata Banerjee) సంచలన నిర్ణయం తీసుకున్నారు. 294 నియోజకవర్గాలకు గాను 291 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. మిగితా మూడు స్థానాలను తమ మిత్రపక్షమైన భారతీయ గోర్ఖా ప్రజాతంత్రిక్ మోర్చా (బీజీపీఎం)కు కేటాయించారు. అయితే 74 మంది సిట్టి్ంగ్ ఎమ్మెల్యేలకు ఆమె ఊహించని షాకిచ్చారు. అసెంబ్లీ ఎన్నికల్లో వారికి టికెట్లు నిరాకరించారు.
మమతా బెనర్జీ మరోసారి భవానిపూర్ నుంచి పోటీ చేయనుండగా, ఇక్కడ బీజేపీ ఇప్పటికే ప్రతిపక్ష నాయకుడు సుభేందు అధికారిని బరిలోకి దింపింది. తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) 135 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలను వారి ప్రస్తుత స్థానాల్లోనే కొనసాగించగా, 15 మందిని కొత్త నియోజకవర్గాలకు మార్చింది. 291 మంది టీఎంసీ అభ్యర్థులలో 52 మంది మహిళలు, 95 మంది షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలకు చెందినవారు కాగా, 47 మంది మైనారిటీ వర్గాలకు చెందినవారు ఉన్నారు.
Also Read : తుపాకీతో ఆట.. గుండెల్లోకి దూసుకెళ్లిన తూటా.. ప్రాణం తీసిన రీల్స్ పిచ్చి
అభ్యర్థులను ప్రకటించని కాంగ్రెస్
మమతా బెనర్జీ కాళీఘాట్ నివాసంలో అభిషేక్ బెనర్జీ, సీనియర్ నాయకుడు సుబ్రతా బక్షి సమక్షంలో ఈ ప్రకటన చేశారు. ప్రధాన రాజకీయ పార్టీలలో, కాంగ్రెస్ ఇంకా తన అభ్యర్థుల పేర్లను ప్రకటించలేదు. టికెట్లు దక్కిన వారిలో యువ నేతలు, వృత్తి నిపుణులు, ప్రముఖులు ఉన్నారు. అయితే ఈసారి సెలబ్రిటీల కంటే బలమైన అభ్యర్థులకే పార్టీ ప్రాధాన్యమిచ్చింది.
Also Read : ఇరాన్‌కు బిగ్ షాక్.. ఇజ్రాయెల్ దాడుల్లో మరో కీలక నేత హతం
Follow Us