కర్ణాటకలో దేశ చిత్రపటం అంశం దుమారం రేపుతోంది. కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన ఓ ప్లెక్సీలో భారత చిత్రపటం తప్పుగా ఉండటంతో బీజేపీ కాంగ్రెస్‌పై తీవ్ర విమర్శలు చేసింది. ఇక వివరాల్లోకి వెళ్తే.. బెళగావిలో కాంగ్రెస్ పార్టీ నవ సత్యాగ్రహ్ బైఠక్ (CWC) సమావేశం నిర్వహించింది. ఈ భేటీకి ముందు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే జాతీయ జెండా ఎగరవేశారు. అయితే అక్కడ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన బ్యానర్‌లో భారత చిత్రపటం పైభాగంలో తప్పుగా ఉంది. దీంతో బీజేపీ కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పిస్తోంది. Also Read: ఏపీ నుంచి మహారాష్ట్ర వరకు.. ఈ ఏడాదిలో పొలిటికల్ హైలెట్స్ ఇవే! '' కాంగ్రెస్ పార్టీ ఏర్పాటుచేసిన బ్యానర్‌లో భారత చిత్రపటంలో జమ్మూకశ్మీర్‌లో కొన్ని ప్రాంతాలు కనిపించడం లేదు. కశ్మీర్‌ను పాకిస్థాన్‌లో విలీనం చేసేలా ఆ మ్యాప్ ఉంది. ఇలా వక్రీకరించిన చిత్రపటన్ని ప్రదర్శించడం భారత సార్వభౌమాధికారాన్ని అగౌరవపరచడమే. ఓటు బ్యాంకును పెంచుకునేందుకే కాంగ్రెస్ ఇలా చేస్తోంది. ఇది సిగ్గుచేటు. వెంటనే బ్యానర్లు తొలగించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని'' బీజేపీ ఎక్స్‌లో డిమాండ్ చేసింది. మరోవైపు బీజేపీ నేత సుధాంశు త్రివేది కీలక వ్యాఖ్యలు చేశారు. గాంధేయ భారత్ పేరుతో కాంగ్రెస్ నేతలు దేశ చిత్రపటాన్ని వక్రీకరించారని ఆరోపించారు. బుజ్జగింపు రాజకీయాల కోసం కాంగ్రెస్ ఎలాంటి పనైనా చేస్తుందని చెప్పేందుకే ఈ బ్యానర్లే ఉదాహరణ అన్నారు. దేశ సమగ్రతను కాపాడుతామని ప్రమాణం చేసిన కాంగ్రెస్ నేతలు చిత్రపటాన్ని ఉల్లంఘించడం ఆందోళనకరమని ధ్వజమెత్తారు. మ్యాప్‌లో కొన్ని ప్రాంతాలను తొలగించేందుకు కారణం ? పార్టీ కుట్రలో భాగమేనా అంటూ నిలదీశారు. Also Read: కాంగ్రెస్‌ను ఇండియా కూటమి నుంచి తొలగించాలి.. ఆప్ షాకింగ్ కామెంట్స్ భారత్‌ను అస్థిరం చేసేందుకు అమెరికా పెట్టుబడిదారు జార్జ్‌సోరోస్‌తో కాంగ్రెస్ చేతులు కలిపిందని విమర్శించారు. అయితే ఈ అంశంపై కాంగ్రెస్ పార్టీ స్పందించింది. బీజేపీ చేస్తున్న ఆరోపణలను ఖండించింది. ఈ బ్యానర్లను తమ పార్టీ అధికారికంగా పెట్టలేదని చెప్పింది. ఎవరో అనుచరులు పెట్టి ఉంటారని స్పష్టం చేసింది.