Arvind Kejriwal: అర్చకులకు నెలకు రూ.18 వేలు.. కేజ్రీవాల్ సంచలన ప్రకటన ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ కీలక ప్రకటన చేశారు. ఆలయాలు, గురుద్వారాల్లో పనిచేసే పూజారులు, గ్రంథీల కోసం ఓ కొత్త స్కీమ్‌ను ప్రకటించారు. తాము అధికారంలోకి వస్తే.. అర్చకులకు గౌరవ వేతనంగా నెలకు రూ.18 వేలు ఇస్తామని తెలిపారు. By B Aravind 30 Dec 2024 in నేషనల్ Latest News In Telugu New Update Arvind Kejriwal announces ₹18000 for priests షేర్ చేయండి వచ్చే ఏడాది ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే(Delhi assembly polls). ఆప్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఇప్పటికే ప్రచారాలు మొదలుపెట్టాయి. ఈ నేపథ్యంలో ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ కీలక ప్రకటన చేశారు. ఆలయాలు, గురుద్వారాల్లో పనిచేసే పూజారులు, గ్రంథీల కోసం ఓ కొత్త స్కీమ్‌ను ప్రకటించారు(Pujari Granthi Samman Yojana). తాము అధికారంలోకి వస్తే.. అర్చకులకు గౌరవ వేతనంగా నెలకు రూ.18 వేలు ఇస్తామని తెలిపారు. Also Read: 2024లో దారుణంగా పతనమైన రాజకీయ నేతలు వీళ్లే.. '' అర్చకులు మన ఆచారాలను భవిష్యత్తు తరాలకు అందించడంతో కీలక పాత్ర పోషిస్తున్నారు. కానీ ప్రస్తుతం వాళ్ల ఆర్థిక పరిస్థితి గురించి ఎవరూ పట్టించుకోవడం లేదు. మేము అధికారంలోకి వస్తే వాళ్లకు గౌరవ వేతనంగా నెలకు రూ.18 వేలు అందిస్తాం. ఈ పథకం రిజిస్ట్రేషన్ సోమవారం నుంచి ప్రారంభమవుతుంది. హనుమాన్ టెంపుల్‌లో నేనే ఈ రిజిస్ట్రేషన్‌ను ప్రారంభిస్తానని'' కేజ్రీవాల్(Arvind Kejriwal) అన్నారు. అలాగే తమకు ఎలాంటి అవాంతరాలు కలిగించవద్దని బీజేపీని కోరారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి కూడా విజయం సాధించాలని ఆప్ గట్టిపట్టు మీద ఉంది. కేజ్రీవాల్ జైలు నుంచి బెయిల్‌పై విడుదలయ్యాక సీఎం పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ప్రజల్లో తన నిజాయతీని నిరూపించుకున్న తర్వాతే మళ్లీ సీఎం గద్దెపై కూర్చుంటానని ఆయన గతంలో చెప్పిన మాటలు సంచలనం రేపాయి. ఈ నేపథ్యంలోనే ఈసారి కూడా అధికారంలోకి వచ్చేందుకు తమ వ్యూహాలకు పదును పెడుతున్నారు. Also Read: భోజనాలు లేటయ్యాయని..పెళ్లి క్యాన్సిల్ చేసుకున్న పెళ్లికొడుకు! ఇప్పటికే కేజ్రీవాల్ తాము అధికారంలోకి వస్తే.. వృద్ధుల కోసం సంజీవని స్కీమ్(సీనియర్ సిటిజెన్లకు ఉచిత వైద్యం), మహిళా సమ్మాన్ యోజన (18 ఏళ్లు దాటిన ప్రతీ మహిళకు రూ.2100 ఆర్థిక సాయం) పథకాలు అందిస్తామని హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా అర్చకులు కూడా గౌరవ వేతనం ఇచ్చే స్కీమ్ తీసుకొస్తామని ప్రకటించడం ప్రాధాన్యం సంతరించుకుంది . #Pujari Granthi Samman Yojana #Delhi Assembly Polls #national-news #telugu-news #latest-news-in-telugu #delhi-assembly-elections #arvind-kejriwal మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి