/rtv/media/media_files/2025/03/14/llPYshUXvHYQttC9C42d.jpg)
Holi Celebrations
దేశవ్యాప్తంగా ఈరోజు హోలీ వేడుకలు జరుగుతున్నాయి. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందరూ ఒకరిపై మరోకరు రంగులు చల్లుకుంటూ సంబరాలు చేసుకుంటున్నారు. సాధారణంగా హోలీ అంటే ఒకరోజే ఉంటుంది. మరికొందరు రెండ్రోజులు చేసుకుంటారు. అయితే ఓ ప్రాంతంలో మాత్రం ఏకంగా 10 రోజుల పాటు హోలీ వేడుకలు జరుగుతాయి. ఇంతకీ అది ఎక్కడో తెలియాలంటే ఈ ఆర్టికల్ చదవాల్సిందే.
Also Read: వీడేం మనిషండీ బాబు.. పొరుగింటి వారితో గొడవ.. కారుతో ఢీకొట్టడంతో తలకిందులుగా వేలాడిన మహిళ!
గుజరాత్‌లోని డాంగ్ జిల్లాలో హోలీని 10 రోజుల పాటు జరుపుకుంటారు. ఆదివాసీ ప్రజలు ఎక్కువగా ఉండే ఈ జిల్లాలో హోలీ ఉత్సవాలకు ఒక ప్రత్యేకత ఉంది. ఇక్కడ ఇప్పటికీ ఐదుగురు రాజ వంశస్థులు ఉన్నారు. ఏడాదిలో ఒకసారి ఈ రాజులను బహిరంగంగా సన్మానించే కార్యక్రమం ఉంటుంది. పది రోజుల పాటు ఈ ఉత్సవం ఉంటుంది. దీన్ని డాండ్ దర్బార్ మేళా అని పిలుస్తారు. ఈ ఉత్సవాల్లో ఆ రాజులను రథాలలో కూర్చోబెట్టి వేదిక దగ్గరకు తీసుకొస్తారు. ఆ తర్వాత ఘనంగా సన్మానిస్తారు. వీళ్లకు ప్రభుత్వం ఫించను కూడా ఇస్తుంది.
Also Read: వీధికుక్క నోట్లో అప్పుడే పుట్టిన పసికందు.. 45 రోజుల్లో మూడో ఘటన
పది రోజుల పాటు జరిగే ఈ హోలీ ఉత్సవాల్లో ప్రతిరోజూ అక్కడి ఆదివాసీ మహిళలు సాయంత్రం పూట జానపద గీతాలు పాడుతూ అలరిస్తారు. అలాగే వివిధ పూజా కార్యక్రమాలు కూడా చేస్తారు. అలాగే చిన్నారులు తమ మేనమామలకు హోలీ స్నానం చేయిస్తారు. చిన్న పిల్లను భక్త ప్రహ్లాదుని రూపాలుగా భావించి పూజలు చేస్తారు.
Also Read: పాలక్కాడ్‌లో అత్యధిక స్థాయిలో అతినీలలోహిత కిరణాలు...రెడ్ అలర్ట్!
Also Read: భయపెడుతున్న బర్డ్ ఫ్లూ.. హోలీ రోజు గుడ్లు కొట్టుకోవచ్చా? లేదా?