బీహార్‌లోని ముంగేర్ జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. గోవింద్‌పూర్‌లోని ఓ ఎనిమిదేళ్ల కుర్రాడుని దారుణంగా కాల్చి చంపాడు. అన్షు కుమార్ చలి కోసం ఏర్పాటు చేసిన మంటల దగ్గర ఉన్నాడు. రౌడీ అయిన నితీష్ కుమార్ అన్షుని షాప్‌కి వెళ్లి సిగరెట్ తీసుకురమ్మని కోరాడు. అయితే చలి వల్ల అన్షు సిగరెట్ తీసుకురావడానికి నిరాకరించాడు. దీంతో అతని దగ్గర ఉన్న పిస్టల్‌తో ఆ బాలుడిని కాల్చి అనంతరం అక్కడి నుంచి పారిపోయాడు. ఇది కూడా చూడండి: Makara Sankranti: సంక్రాంతికి గాలిపటాలు ఎందుకు ఎగరేస్తారో తెలుసా..దాని వెనుక ఉన్న కథేంటంటే! తలకు బుల్లెట్ తగలడంతో.. బుల్లెట్ శబ్ధం విని కుటుంబ సభ్యులు, ఇతర వ్యక్తులు వచ్చి చూసే సరికి రక్తం మడుగులో ఆ బాలుడు ఉన్నాడు. వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. అయితే పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం ఉన్నత ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో చికిత్స తీసుకుంటూనే ఆ బాలుడు మరణించాడు. తలకు బుల్లెట్ తగలడం వల్ల మరణించినట్లు వైద్యులు తెలిపారు. ఇది కూడా చూడండి: అస్సాం బొగ్గు గని ప్రమాదం.. ముగ్గురు మృతి ఇదిలా ఉండగా.. ఏపీలో మద్యం మత్తులో తల్లీ కూతుర్ని దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటన పులివెందుల నియోజకవర్గంలో జరిగింది. వివరలోకి వెళ్తే.. తొండూరు మండలం తుమ్మలపల్లిలో గంగాధర్‌రెడ్డి.. భార్య, కూతురు నివాసం ఉంటున్నారు. అయితే సోమవారం రాత్రి ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ.. గంగాధర్‌రెడ్డి ఫుల్ల్‌గా తాగి ఇంటికి వచ్చాడు. అనంతరం భార్య శ్రీలక్ష్మీ, కుమార్తె గంగోత్రిని కొడవలితో నరికి చంపి పారిపోయాడు. స్థానికులు శ్రీలక్ష్మీ, గంగోత్రి మృతి చెందిన విషయాన్ని పోలీసులకు సమాచారం అందించారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. అనంతరం సంఘటనా స్థలానికి చేరుకున్నారు ఇది కూడా చూడండి: ప్లీజ్.. ఆ వీడియోను తొలిగించండి : కోర్టు మెట్లెక్కిన రమ్య ఇది కూడా చూడండి: Home Tips: వంటగది సింక్ జామ్ అయితే ఇలా చేయండి