Bengaluruలో విషాదం.. పిల్లలకు విషం ఇచ్చి.. భార్యాభర్తలు ఆత్మహత్య

బెంగళూరులో ఇద్దరు పిల్లలకు విషం ఇచ్చి భార్యాభర్తలు ఆత్మహత్య చేసుకున్న ఘటన జరిగింది. ఐటీ ఉద్యోగి ఇద్దరు పిల్లలకు విషం ఇచ్చాడు. ఆ తర్వాత భార్యతో కలిసి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆర్థిక సమస్యల వల్ల ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

New Update
Bengaluru it

Bengaluru it Photograph: (Bengaluru it)

ఆర్థిక సమస్యల వల్ల ఓ కుటుంబం ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన బెంగళూరులో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. ఉత్తరప్రదేశ్‌కి చెందిన అనుప్ కుమార్ అనే ఓ ఐటీ ఉద్యోగి కుటుంబంతో కలిసి బెంగళూరులో ఉంటున్నాడు. ఇతనికి భార్య రాఖీ (35), ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే చిన్నారులకు మొదటిగా విషం ఇచ్చి ఆ తర్వాత భార్యాభర్తలు ఉరి వేసుకున్నారు.

ఇది కూడా చూడండి:Car Accident: చింటూ టార్చర్‌ వల్లే చనిపోతున్నాం.. కారు దగ్ధం బాధితులు!

ఇది కూడా చూడండి: USA: హెచ్–1 వీసాదారులకు గుడ్‌ న్యూస్.. స్టాంపింగ్‌ ఇక అమెరికాలోనే...

ఆర్థిక సమస్యల వల్లే..

ఖర్చులు, ఆర్థిక సమస్యలతో తాళ్లలేక ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. స్థానికులు గమనించి పోలీసులకు తెలియజేయగా.. వెంటనే అక్కడికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. వీరే ఉరి వేసుకున్నారా? లేకపోతే ఎవరైనా చేసి ఇలా ప్లాన్ చేశారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

ఇది కూడా చూడండి: Keir Starmer:మస్క్‌ చెప్పేవన్నీ అబద్దాలే..బ్రిటన్‌ ప్రధాని!

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు