జగన్ ఇంటి వద్ద మంటలు.. సీక్రెట్ ఇదే.. TDP సంచలన ట్వీట్!

జగన్ నివాసానికి సమీపంలో నిన్న రెండు సార్లు అగ్ని ప్రమాదం జరగడంపై టీడీపీ సంచలన ట్వీట్ చేసింది. మద్యం అమ్మకాల్లో అక్రమాలపై సిట్ వేయడంతో పలు కీలక పత్రాలను తగలబెట్టారని ఆరోపించింది. కుట్ర అయితే సీసీ టీవీ ఫుటేజ్ ఎందుకు బయట పెట్టలేదని ప్రశ్నించింది.

New Update
TDP Tweet Over YCP Office Fire Accident

TDP Tweet Over YCP Office Fire Accident

తాడేపల్లిలోని మాజీ సీఎం జగన్ (YS Jagan) నివాసం సమీపంలో నిన్న రెండు సార్లు అగ్ని ప్రమాదం (Fire Accident) జరిగిన విషయం తెలిసిందే. సాయంత్రం ఒక సారి, రాత్రి 9 గంటల ప్రాంతంలో మరోసారి మంటలు చెలరేగాయి. గార్డెన్ వద్ద ఎండిపోయిన మొక్కలకు మంటలు అంటుకున్నాయి. అయితే.. ఈ మంటలు ఎంలా అంటుకున్నాయనే విషయంపై వైసీపీ అనుమానం వ్యక్తం చేసింది. జగన్ భద్రతపై సైతం ఆందోళన వ్యక్తం చేసింది. భద్రతాలోపం కారణంగానే ఈ పరిస్థితి తలెత్తిందని వైసీపీ ఆరోపించింది.

Also Read :  TDPలో మంగ్లి చిచ్చు.. కేంద్ర మంత్రి రామ్మోహన్ పై దుమ్మెత్తి పోస్తున్న కేడర్!

Also Read :  తాడేపల్లి వైసీపీ ఆఫీస్ సమీపంలో అగ్ని ప్రమాదం

లిక్కర్ స్కామ్ పత్రాలకు నిప్పు?

అయితే.. ఈ అంశానికి సంబంధించి టీడీపీ (TDP) సంచలన ట్వీట్ చేసింది. లిక్కర్ అమ్మకాలపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ నేపథ్యంలోనే ఈ మంటలు అంటూ అనుమానం వ్యక్తం చేసింది. సిట్టు పడింది - తగలబడిందంటూ సెటైర్లు వేసింది. ఈ మేరకు టీడీపీ అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు.

Also Read :  కుల గణన సర్వేపై నెక్స్ట్ స్టెప్ ఇదే.. మంత్రి ఉత్తమ్ సంచలన ప్రకటన!

ప్యాలెస్ బయట తగలబడిన కాగితాలు, డైరీలు ఏంటి?..  సిట్ తన ఇంటి దాకా వస్తుందని, ముందే లిక్కర్ స్కాంకి సంబంధించి తాను రాసుకున్న లెక్కలు, డాక్యుమెంట్లు తగల బెట్టారా?.. నిన్న సాయంత్రం జరిగితే, ఇప్పటి వరకు తన ఇంటి ముందు ఉన్న సిసి ఫుటేజ్ ఎందుకు బయట పెట్టలేదు? అంటూ ప్రశ్నలు గుప్పించింది టీడీపీ. తానే తగలబెట్టి, ప్రభుత్వం మీద తోసేయటమే, 2.0 నా? అంటూ విమర్శలు చేసింది. ఎన్ని కుట్రలు చేసినా వదిలేది లేదు. సిట్ వస్తుంది, విచారణ చేస్తుంది, నీ అవినీతిని బయటకు తీస్తుంది.. గెట్ రెడీ.. స్టే ట్యూన్డ్ టు తాడేపల్లి ఫైల్స్.. అంటూ హెచ్చరించింది. 

Also Read :  వివేక్ కుట్రతో మాదిగలకు మళ్లీ అన్యాయం.. వర్గీకరణ ఇలా చేస్తారా?: మందకృష్ణ సంచలన ప్రెస్ మీట్!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు