Year Ender 2024: దేశాన్ని ముంచేసిన విషాదాలు ఇవే.. 2024 ఓ చేదు జ్ఞాపకం! 2024 కొందరి జీవితాల్లో వెలుగులను నింపడంతో పాటు మరొకొందరి జీవితాలను అంధకారంలోకి నెట్టేసింది. ఈ ఏడాది దేశాన్ని ముంచెత్తిన విషాద ఘటనల గురించి ఒక్కసారి లుక్కేద్దాం.. By Archana 29 Dec 2024 | నవీకరించబడింది పై 31 Dec 2024 19:39 IST in టాప్ స్టోరీస్ నేషనల్ New Update 2024 disasters షేర్ చేయండి 2024 Disasters : 2024 కొందరి జీవితాల్లో వెలుగులు నింపింది. మరికొందరి జీవితాలను మలుపు తిప్పింది.. ఇంకొందరి జీవితాలను అంధకారంలోకి నెట్టింది. ప్రకృతి వైపరీత్యాలు, మనుషుల నిర్లక్ష్యం, భద్రతా లోపాలు ఇలా చాలా కారణాలతో వేలాదిమంది ప్రాణాలు కోల్పాయారు. 2024 లో దేశాన్ని ముంచెత్తిన విషాద ఘటనల గురించి ఒక్కసారి లుక్కేద్దాం.. 2024 విషాద ఘటనలు కేరళ వయనాడ్ విపత్తు ఆ ఊరిని కన్నీటి వరద ముంచేసింది. వందలాది కుటుంబాలు కుప్పకూలిన శిధిలాల కింద చితికిపోయాయి. జూలై 31న కేరళ వయనాడ్ జిల్లాలో భారీగా వర్షాలు కురిశాయి. వర్ష భీభత్సం పెరగడంతో కొండచరియలు విరిగి ఊర్ల మీద పడ్డాయి. 254 మంది ప్రాణాలు ఈ విపత్తుకు బలైయ్యాయి. ఆకుపచ్చని చెట్లతో ప్రకృతి ప్రేమకు ప్రతిరూపంగా కనిపించే కేరళ ఎరుపు రంగు పూసుకొని శవాల గుట్టలను కళ్ళకు చూపించింది. Wayanad Also Read : Telangana: దారుణం.. తెలంగాణలో ఒకే రోజు ముగ్గురు పోలీసులు మృతి..! హోర్డింగ్ ఘటన 2024 మే 13న ముంబై ఘట్కోపర్ ప్రాంతంలో ఒక పెద్ద హోర్డింగ్ కుప్పకూలడంతో 17 మంది ప్రాణాలు విడిచారు. మరో 74 మంది తీవ్రంగా గాయపడ్డారు. భారీ వర్షాలు, గాలుల కారణంగా ఈ ప్రకృతి వైపరిత్యం చోటుచేసుకుంది. భారీ వరదలు ప్రతీ ఏడాది లాగే.. 2024లో కూడా మాన్సూన్ సీజన్ లో భారత దేశం తీవ్ర వాతావరణ పరిస్థితులను ఎదుర్కొంది. భారీ వరదల కారణంగా ఈ ఏడాది ,492 మంది ప్రాణాలు కోల్పోయారు. హర్యానా, రాజస్థాన్, పంజాబ్, ఢిల్లీతోపాటు పలు చోట్ల వరదలు, కొండచరియలు విరిగిపడటంతో జూన్ 11న ఒక్కరోజే 28 మంది మరణించారు. భోలేబాబా ఘటన జులై 2 2024.. ఆరోజు జరిగిన తొక్కిసలాట ఘటన దేశవ్యాప్తంగా ప్రజల మనసుల్ని కలచివేసింది. ఓ బాబా పాద దూళి కోసం ఎగబడ్డ భక్తులు చివరికి ఆ మట్టిలోనే కలిసిపోవడం ఎంతో విషాదకరం. ఉత్తర ప్రదేశ్ హత్రాస్ లో జరిగిన ఈ తొక్కిసలాట ఘటనలో 121 మంది మరణించారు. భోలేబాబా నిర్వహించిన ఓ కార్యక్రమానికి 80 వేల మందికి పర్మిషన్ ఇవ్వగా.. 2 లక్షల మంది వచ్చారు. దీంతో తొక్కిసలాట జరిగింది. Also Read : Vitamin D: విటమిన్ డి ఇంజెక్షన్లతో కిడ్నీలో రాళ్లు వస్తాయా? bhole baba Also Read : డిసెంబర్ 30న సోమవతి అమావాస్య.. ఈరోజు ప్రాముఖ్యత ఏంటో తెలుసా? కల్తీ మద్యం ఈ ఏడాది జూన్ 21న తమిళ నాడు కళ్లకురిచి జిల్లాలో కల్తీ మద్యం తాగి 65 మంది మరణించారు. మద్యంలో మిథనాల్ మోతాదు ఎక్కువగా ఉండడం వల్ల తాగిన వెంటనే వాంతులు, కడుపునొప్పి, విరేచనాలు అయ్యాయి. ఆ తర్వాత కాసేపటికి ప్రాణాలు కోల్పోయారు. విజయవాడ వరదలు ఈ ఏడాది సెప్టెంబర్ లో విజయవాడలో అనూహ్యంగా కురిసిన భారీ వర్షాల కారణంగా 35 మంది మరణించారు. 29 సెంటీమీటర్ల వర్షపాతం కృష్ణా, బుడమేరు నదులను ముంచెత్తింది. ఇళ్ళు, వ్యవసాయ భూములు నీటమునిగాయి. ఫార్మా ఘటన ఆగస్టు 21 న అనకాపల్లి జిల్లా అచ్యుతాపురంలో ఫార్మా సెజ్‌లోని ఎసెన్షియా అడ్వాన్సుడ్ సైన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో రియాక్టర్ పేలి 17 మంది చనిపోగా 60 మంది తీవ్రంగా గాయపడ్డారు. Also Read: SSMB29: రికార్డులకు తెరలేపే కాంబినేషన్.. మహేశ్‌కు జోడీగా స్టార్ హీరోయిన్! #latest-telugu-news #national news in Telugu #today-news-in-telugu #trending news telugu #natural-disasters #YEAR ENDER 2024 మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి