/rtv/media/media_files/2026/03/21/wife-abandons-sick-husband-in-graveyard-in-telangana-2026-03-21-06-59-27.jpg)
Wife Abandons Sick Husband in Graveyard in Telangana
జగిత్యాల(jagtial) లో అమానుష సంఘటన చోటుచేసుకుంది. అనారోగ్యంతో బాధపడుతున్న ఓ వ్యక్తిని బతికి ఉండగానే శ్మశానవాటికలో ఓ కుటుంబం వదిలివెళ్లేసింది. ఇంతకీ అసలేం జరిగిందో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే. మంచినీళ్లబావి ప్రాంతానికి చెందిన ఎండ్రికాయల శ్రీధర్ (49)కు భార్య సునీత, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. ఉపాధి కోసం అయిదేళ్ల కిందట శ్రీధర్ సౌదీ అరేబియాకు వెళ్లాడు. ఓ కంపెనీలో జాయిన్ అయ్యాడు. వేతనం తక్కువగానే ఉన్నప్పటికీ జల్సాలకు అలవాటు పడ్డాడు. ఆ తర్వాత కుటుంబ సభ్యులను పట్టించుకోవడం మానేశాడు.
Also Read: గ్యాస్ సిలిండర్ లేకుండానే… 10 ఏళ్లుగా గ్యాస్‌తో ఉచితంగా వంట!
Wife Abandons Sick Husband In Graveyard
దీంతో అతని భార్య సునిత ఇంటివద్ద కూలి పని చేస్తూ పిల్లలను పోషించేది. అయితే ఇటీవల శ్రీధర్ తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. దీంతో అతడిని కంపెనీ స్వదేశానికి తిరిగి పంపించింది. ఇంటికి వచ్చాక శ్రీధర్ కుటుంబ సభ్యులు అతడికి వైద్యం అందించారు. మూత్రపిండాలు దెబ్బతీని తీవ్ర అనారోగ్యానికి గురైనట్లు వైద్యులు చెప్పారు. దీంతో కుటుంబ సభ్యులు గురువారం రాత్రి చింతకుంట శ్మశానవాటిక(Graveyard)లో వదిలివెళ్లారు.
Also Read: భద్రాచలంలో విషాదం.. గోదావరిలో ఐదుగురు విద్యార్థులు మృతి
అయితే శుక్రవారం మధ్యాహ్నం అటుగా వెళ్లినవాళ్లు 108కు సమాచారం అందించారు. దీంతో శ్రీధర్‌ను అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించారు. తనను భార్య, సోదరుడు పట్టించుకోవడం లేదని శ్రీధర్ చెబుతున్నాడు. తనను వదిలేసి గాంధీనగర్‌లోని సునిత పుట్టింటికి వెళ్లారని స్థానికులు చెబుతున్నారు. ప్రస్తుతం శ్రీధర్‌కు జిల్లా ఆస్పత్రిలో వైద్యులు చికిత్స అందిస్తున్నారు.
Follow Us