TTD: తెలంగాణలోని తిరుమల తిరుపతి భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్ చెప్పింది. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీల సిఫార్సు లేఖలు వారానికి రెండుసార్లు అనుమతిస్తామని అధికారికంగా ప్రకటించింది. ప్రజాప్రతినిధుల సిఫారసుల మీద దర్శనానికి వచ్చిన వారికి ప్రత్యేక దర్శనం అయ్యేలా చూస్తామని బోర్డు తెలిపింది. తెలంగాణ భక్తులపట్ల నిర్లక్ష్యం.. ఇటీవల తెలంగాణ దేవదాయ శాఖ మంత్రి కొండా సురేఖ తిరుమలలో ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలను అనుమతించకపోవడంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వం నుంచి తిరుమలలో తెలంగాణ భక్తులు నిర్లక్ష్యానికి గురవుతున్నారన్నారు. శ్రీశైలం భ్రమరాంబసహిత మల్లికార్జునస్వామిని దర్శించుకున్న అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. తిరుమలలో తెలంగాణ భక్తుల పట్ల నిర్లక్ష్యం చూపుతున్నారన్నారు. తెలంగాణ ప్రజాప్రతినిధులకు టీటీడీ శుభవార్త.. వారానికి రెండు సార్లు తెలంగాణ నేతల సిఫార్సు లేఖలు అనుమతించాలని నిర్ణయం..@TTDevasthanams @TelanganaCMO pic.twitter.com/vdvi2PJJHd — Telangana Awaaz (@telanganaawaaz) December 27, 2024 ఇది కూడా చదవండి: Kohli: విరాట్‌ను అవమానించిన ఆసీస్ మీడియా.. ఆ పేరుతో హెడ్ లైన్స్! తెలంగాణ భక్తులు ఎక్కువ సంఖ్యలో వస్తున్నారని, తెలంగాణ వారి వల్లే తిరుమలకు ఆదాయం సమకూరుతుందని ఆమె చెప్పారు. అప్పుడు దురదృష్టం వల్ల తెలంగాణ శ్రీశైలాన్ని కోల్పోయిందన్నారు. టీటీడీ తెలంగాణలో ధర్మప్రచారానికి నిధులు కేటాయించాలని కోరారు. తెలంగాణలో దేవాలయాలు, కల్యాణ మండపాల నిర్మాణానికి టీటీడీ సహకరించాలని విజ్ఞప్తి చేశారు. దీంతో దిగొచ్చిన టీటీడీ బోర్డ్ వారానికి రెండుసార్లు అనుమతిస్తామని స్పష్టం చేసింది. ఇది కూడా చదవండి: కొప్పులో పూలు, పట్టు చీర.. మృణాల్ అందాలు చూస్తే మతిపోతుంది!