Tollywood: టాలీవుడ్ సినీ ప్రముఖులు గురువారం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలవబోతున్నట్లు తెలిపారు. సమస్య పరిష్కారం దిశగా చర్చలు జరుపుతామని నిర్మాత, ఎఫ్‌డీసీ ఛైర్మన్ దిల్ రాజు చెప్పారు. కిమ్స్ ఆస్పత్రిలో శ్రీతేజ్ ను పరామర్శించి అల్లు అరవింద్, దిల్ రాజు మీడియాతో మాట్లాడారు. బాధిత కుటుంబానికి అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్, నిర్మాత సంస్థ మైత్రిమూవీమేకర్స్ తరఫున రెండు కోట్ల రూపాయలు ఇవ్వబోతున్నట్లు ప్రకటించారు. దిల్ రాజు కీలక ప్రకటన.. ఇక ఈ ఘటనలో దిల్ రాజు కీలకంగా వ్యవహరిస్తున్నారు. 'గేేమ్ ఛేంజర్' మూవీ ప్రమోషన్స్ ముగించుకుని అమెరికా నుంచి రాగానే సంధ్య థియేటర్ ఘటనపై స్పందించిన నిర్మాత.. ఇటు తెలంగాణ ప్రభుత్వం, అల్లు అర్జున్ మధ్య సయోధ్య కుదిర్చేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇందులో భాగంగానే గురువారం సినీ ప్రముఖులంతా ముఖ్యమంత్రి రేవంత్ ఇంటికి వెళ్తామని ప్రకటించారు. సమస్యను వీలైనంత త్వరగా సద్దుమణిగేలా సీఎంతో చర్చిస్తామని, తమనుంచి అన్ని విధాల సహాకారం అందించేందుకు సిద్దంగా ఉన్నామని దిల్ రాజు తెలిపారు. అలాగే బాధిత కుటుంబానికి ఆర్థికంగా అండగా నిలుస్తామని ఇప్పటికే ప్రకటించగా.. శ్రేతేజ్ కోలుకోవడం ఊరటకలిగించే అంశమని చెప్పారు. ఇండస్ట్రీ- ప్రభుత్వం మధ్య వారధిగా.. "నిన్నటికి, ఈరోజుకి బాలుడి ఆరోగ్యం కాస్త మెగురుపడింది. అతడి హెల్త్ కండిషన్ బాగుందని వైద్యులు తెలిపారు. బాలుడి కుటుంబానికి అల్లు అర్జున్, "పుష్ప 2" నిర్మాతలు, దర్శకుడు ఆర్థిక సాయం చేయాలని నిర్ణయించుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి అపాయింట్‌మెంట్ అడిగాం. సినీ ప్రముఖులతో సీఎంను కలిసి చర్చిస్తాం. గురువారం ఉదయం 10 గంటలకు సమావేశం ఉంటుంది. హీరోలు, దర్శకులు, నిర్మాతలంతా కలిసి వెళ్తాం. నేను చిత్ర పరిశ్రమ వ్యక్తిని. ఇండస్ట్రీ- ప్రభుత్వం మధ్య వారధిగా ఉండాలని సీఎం బాధ్యత ఇచ్చారు. నేను అదే చేస్తున్నా. అల్లు అర్జున్ ను కూడా త్వరలోనే కలుస్తా' అని చెప్పారు. ఇది కూడా చదవండి: Allu Arjun: సంధ్య థియేటర్ ఘటన.. అల్లు అర్జున్, సుకుమార్ భారీ ఆర్థిక సాయం మనందరి మధ్య తిరుగుతాడు.. అల్లు అరవింద్ "శ్రీతేజ్ కోలుకుంటున్నాడు. వెంటిలేషన్ తీసేశారు. బాలుడు త్వరలోనే మనందరి మధ్య తిరుగుతాడని ఆశిస్తున్నా. న్యాయపరమైన అంశాల కారణంగా బాధిత కుటుంబ సభ్యులను కలవలేకపోతున్నా. అన్ని రకాల అనుమతులు తీసుకుని శ్రీతేజ్‌ను 10 రోజుల క్రితం పరామర్శించా. ఆ సమయంలో వెంటిలేషన్‌పై ఉన్నాడు" అని అల్లు అరవింద్ అన్నారు.