CLP Meeting: ఆ బాధ్యత ఎమ్మెల్యేలదే.. గీత దాటితే ఊరుకునేది లేదు.. కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు అగ్ర నేతల వార్నింగ్!

పార్టీలో సమస్యలు ఉంటే అంతర్గతంగా చర్చించుకోవాలని ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ సూచించినట్లు సమాచారం. పార్టీపై బహిరంగంగా విమర్శలు చేస్తే కఠిన చర్యలు ఉంటాయని స్పష్టం ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. మెజార్టీ సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవం అయ్యేలా చూడాలని తెలుస్తోంది.

New Update
Telangana CLP Meeting

Telangana CLP Meeting

CLP Meeting: పార్టీ లైన్ దాటితే వేటు తప్పదని సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy), పీసీసీ చీఫ్‌ మహేశ్ కుమార్ గౌడ్(PCC Cheif Mahesh Kumar Goud), ఏఐసీసీ ఇన్‌ ఛార్జ్ దీప దాస్ మున్షీ(AICC Incharge Deepa Das) ఎమ్మెల్యేలకు వార్నింగ్ ఇచ్చారు. ఈ రోజు నిర్వహించిన సీఎల్పీ సమావేశంలో మారు మాట్లాడుతూ.. ఏమైనా సమస్యలు ఉంటే అంతర్గతంగా చర్చించుకోవాలని సూచించినట్లు సమాచారం. పార్టీపై బహిరంగంగా విమర్శలు చేస్తే కఠిన చర్యలు ఉంటాయని స్పష్టం చేసినట్లు సమాచారం.

ఇది కూడా చదవండి: By-Elections : తెలంగాణలో త్వరలో ఉప ఎన్నికలు ..కేటీఆర్ సంచలన కామెంట్స్

మంత్రులతో సమన్వయం చేసుకోండి..

మంత్రులు, ఎమ్మెల్యేలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. స్థానిక సంస్థల ఎన్నికలపై పూర్తి దృష్టి పెట్టాలని.. 90 శాతం కాంగ్రెస్ ఖాతాలోనే పడేలా చూడాలని దిశానిర్దేశం చేశారని తెలుస్తోంది. ఇంకా మెజార్టీ సర్పంచ్ లు ఏకగ్రీవం కావాలని.. ఎమ్మెల్యేలే ఆ బాధ్యత తీసుకోవాలని సీఎం స్పష్టం చేసినట్లు సమాచారం.  
ఇది కూడా చదవండి: సీఎం రేవంత్ పై తిరగబడ్డ మంత్రి.. ఆ ఎమ్మెల్యేతో కలిసి ఖర్గేతో చర్చలు.. అసలు కాంగ్రెస్ లో ఏం జరుగుతోంది?

ఇది కూడా చదవండి: Mastan Sai : డ్రగ్స్ ఇస్తాడు.. న్యూడ్ వీడియోలు తీస్తాడు..  మస్తాన్ మాములోడు కాదయ్యా!

ప్రభుత్వం అమలు చేస్తున్న హామీల అమలును క్షేత్ర స్థాయిలో పరిశీలించాలని సీఎం ఎమ్మెల్యేలకు సూచించినట్లు తెలుస్తోంది. గ్రామాల్లో అభివృద్ధి పనులకు సంబంధించి నిధుల కోసం మంత్రులను కలవాలని చెప్పినట్లు సమాచారం. ప్రతిపక్షాలు చేస్తున్న ప్రచారాన్ని ఎప్పటికప్పుడు తిప్పి కోట్టాలని స్పష్టం చేసినట్లు ఎమ్మెల్యేలు తెలిపారు.

ఇది కూడా చదవండి: Sekhar Basha: శేఖర్ బాషాకు బిగ్ షాక్.. మరో కేసు నమోదు..

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు