ముగిసిన సీఎల్పీ సమావేశం.. సీఎం ఎంపిక బాధ్యత ఖర్గేకు
కాంగ్రెస్ సీఎల్పీ సమావేశం ముగిసింది. సీఎల్పీ నేత ఎంపిక బాధ్యతను ఏఐసీసీ అధ్యక్షుడు మల్లి కార్జున ఖర్గేకు అప్పగిస్తూ తీర్మానం చేసినట్లు డీకే శివకుమార్ వెల్లడించారు.
కాంగ్రెస్ సీఎల్పీ సమావేశం ముగిసింది. సీఎల్పీ నేత ఎంపిక బాధ్యతను ఏఐసీసీ అధ్యక్షుడు మల్లి కార్జున ఖర్గేకు అప్పగిస్తూ తీర్మానం చేసినట్లు డీకే శివకుమార్ వెల్లడించారు.
కాంగ్రెస్ నుంచి ఎవరు తెలంగాణ సీఎం కాబోతున్నారనే విషయంపై మరికాసేపట్లో క్లారిటీ రానుంది. ఇప్పటికే 300 మందికి ఏర్పాట్లు చేయాల్సిందిగా రాజభవన్ కార్యాలయానికి కాంగ్రెస్ నాయకులు సమాచారం ఇచ్చారని, సాయంత్రం 5 గంటలకే రేవంత్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నట్లు తెలుస్తోంది.