హైదరాబాద్‌కు రానున్న ద్రౌపది ముర్ము.. సీఎస్ శాంతి కుమారీ కీలక ఆదేశాలు

డిసెంబర్ 17 నుంచి 21 వరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్‌లో పర్యటించనున్నారు. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు చేయాలని సీఎస్ శాంతి కుమారీ అధికారులను ఆదేశించారు. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.

New Update
Draupadi Murmu

డిసెంబర్ 17వ తేదీ నుండి ఐదు రోజులపాటు తెలంగాణలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో చేపట్టాల్సిన ఏర్పాట్లపై సీఎస్ శాంతి కుమారి మంగళవారం సచివాలయంలో ఉన్నతాధికారులతో సమీక్షించారు. పర్యటనలో భాగంగా ఈ నెల 17 నుంచి 21 వరకు రాష్ట్రపతి ముర్ము హైదరాబాద్‌లోని రాష్ట్రపతి నిలయంలో బస చేస్తారని సీఎస్‌ చెప్పారు.

Also Read: ఫుల్ గా మద్యం తాగించి దాడి.. లగచర్ల ఘటనలో బయటపడ్డ దారుణాలు!

ఈ పర్యటనకు సంబంధిత అధికారులు సమన్వయంతో పని చేయాలని, అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రపతి నిలయంలో 24 గంటలు స్నేక్ క్యాచర్ బృందాన్ని అందుబాటులో ఉంచాలన్నారు. ఆ పరిసరాల్లో కోతుల బెడదను ఎదుర్కొనేందుకు ప్రత్యేక బృందాలను నియమించాలని తెలిపారు. అలాగే తేనెటీగలను పట్టుకోవానికి ముందుస్తు ఏర్పాట్లు  చెయాలనీ ఆదేశించారు.

Also Read: ఆధ్యాత్మిక ముసుగులో 20 మందిని భార్యలుగా.. మతనాయకుడికి 50 ఏళ్లు..

Draupadi Murmu

ఇక పోలీసు శాఖ తగిన భద్రతా ఏర్పాట్లు, సరైన ట్రాఫిక్, బందోబస్త్ ప్రణాళికను రూపొందించాలని తెలిపారు. అగ్నిమాపక శాఖ అవసరమైన సిబ్బందితో పాటు తగిన అగ్నిమాపక ఏర్పాట్లు, ఫైర్ టెండర్లను ఏర్పాటు చేయాలన్నారు. అలాగే వైద్యారోగ్యశాఖ సహాయక సిబ్బందిని అందుబాటులో ఉంచాలని ఆదేశించారు.

Also Read: అమెరికాకు వెళ్లాలనుకునేవారికి షాక్.. భారీగా తగ్గిన వీసాలు

 రోడ్డు భవనాల శాఖ విభాగం అవసరమైన బారికేడింగ్‌లు, ఇతర ఏర్పాట్లు చేయాలని.. జీహెచ్‌ఎంసీ, పోలీసు శాఖల సమన్వయంతో రోడ్ల మరమ్మతులు చేపట్టాలని ఆదేశించారు. మరోవైపు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలని విద్యుత్ శాఖ అధికారులను సైతం ఆదేశించారు. ఇక సమావేశంలో డీజీపీ జితేందర్, హోం శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రవిగుప్తా తదితరులు పాల్గొన్నారు. 

Also Read: ట్రంప్ పాలకవర్గంలో మరో భారత సంతతికి చోటు

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు